Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఏప్రిల్‌ నెల వేతనాల్లో కూడా కోతలు ఉండవు..

ఏప్రిల్‌ నెలకుగాను సీనియర్‌ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ సీఈవో రోనోజాయ్‌ దత్‌ తెలిపారు. సీనియర్‌ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనాలు అండనున్నాయి. 

indigo airlines ceo ronojoy dutta rolls back pay cut in april salary of employees
Author
Hyderabad, First Published Apr 24, 2020, 10:52 AM IST

న్యూఢిల్లీ: దేశ వ్యప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ అమలు పరిచిన కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ వల్ల విద్యార్ధులు,ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు.

ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో తన ఉద్యోగులకు ఊరటనిస్తూ తీపి కబురు చెప్పింది. మార్చ్ నెల వేతనాన్ని కోతలు లేకుండా ఇచ్చింది. అయితే  ఇప్పుడు ఏప్రిల్‌ నెలకుగాను సీనియర్‌ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ సీఈవో రోనోజాయ్‌ దత్‌ తెలిపారు.

సీనియర్‌ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనాలు అండనున్నాయి. కానీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు మాత్రం కోత వేతనాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సిబ్బందికి పంపిన ఈ-మెయిల్స్‌లో ఆయన వివరించారు.

కరోనా వైరస్ బారిన పడిన వారికోసం సహాయార్ధంగా తమ వంతు కృషికి చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన  చెప్పారు.

ఏప్రిల్ 14తో ముగుస్తుంది అనుకున్న లాక్ డౌన్ మళ్ళీ వచ్చే నెల మే 3 వరకు పోడిగించారు. లాక్‌డౌన్‌తో సంస్థ ఆదాయంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతున్నప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios