Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ నమస్తే: కరోనాపై పోరుకు ఇండియా ఆర్మీ

కరోనాపై పోరాటానికి ప్రభుత్వానికి సహాయం చేసేందుకు తాము రంగంలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ సరవణే ప్రకటించారు.

Indian Army code names anti-Covid-19 operations 'Operation Namaste'
Author
New Delhi, First Published Mar 27, 2020, 6:14 PM IST


న్యూఢిల్లీ:కరోనాపై పోరాటానికి ప్రభుత్వానికి సహాయం చేసేందుకు తాము రంగంలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రకటించారు.

ఆపరేషన్ నమస్తే పేరుతో కరోనాకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో తాము కూడ భాగస్వామ్యులు అవుతామని ఆయన తెలిపారు.గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని  ఈ ఆపరేషన్ లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్లు తమ కుటుంబాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే సమీపంలోని ఆర్మీ క్యాంప్ లకు సమాచారం ఇవ్వాలని ఆర్మీ కుటుంబాలను కోరారు  ఆర్మీ చీఫ్.

also read:కరోనా: హోం క్వారంటైన్ నుండి హోం టౌన్‌కు జంప్, ఐఎఎస్‌పై కేసు

స్వీయ రక్షణ కోసం జవాన్లు ఏ రకంగా ఉండాలో ఇప్పటికే సూచనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఆర్మీ సిబ్బంది కోసం ఎనిమిది ఆర్మీ క్వారంటైన్లను ఏర్పాటు చేశారు.

దేశంలో కరోనా  పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది కేంద్రం.  ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేలా అన్ని రాష్ట్రాలు పోలీసులను రంగంలోకి దించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios