21 రోజుల లాక్ డౌన్: ఏవి ఉండవు, ఏవి ఉంటాయి, ఉల్లంఘనలకు శిక్షలు
కూరగాయలు, ఆహార ధాన్యాలు, పండ్లు, పాలు వంటి నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ నియమాలు ఉన్నాయి. ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 21 రోజులు కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. కూరగాయాలు, ఆహార పదార్థాలు, పండ్లు వంటి నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ ప్రకటించారు. షట్ డౌన్ కాలంలో ఏవేవి అందుబాటులో ఉంటాయి, ఏవేవీ అందుబాటులో ఉండవనేది ఒక్కసారి చూద్దాం.
ఇవి మూతపడుతాయి
* అన్ని రకాల రవాణా వ్యవస్థలు, విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాలు
కొన్ని మినహాయింపులతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
* వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు
* పారిశ్రామిక సంస్థలు
* హాస్పిటాలిటీ ఎస్టాబ్లిష్ మెంట్స్
* విద్యా సంస్థలు
* అన్ని ప్రార్థనా మందిరాలు, మత వేడుకలు
* అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మత కార్యక్రమాలు
షట్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవీ...
* బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటిఎంలు
* మంచినీటి సరఫరా, శానిటేషన్, విద్యుత్తు సరఫరా వంటి నిత్యావసర సేవలు
* ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని వైద్య సంబంధ సంస్థలు, మందుల తయారీ సంస్థలు, మందుల సరఫరా యూనిట్లు, డిస్పెన్షరీ, కెమిస్టులు, ల్యాబ్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, అంబులెన్స్ లు
* వైద్య సంబంధమైన అధికారులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఇతర ఆస్పత్రులకు సంబంధించినవి.
* ఆహారపదార్థాలు, పండ్లు, కూరగాయాలు, డైరీ, మిల్క్ బుత్స్, మాంసం, ఫిష్, పశు దాణాలకు చెందిన దుకాణాలు, రేషన్ దుకాణాలు.
* ఆహార పదార్థాలు, మందులు, వైద్య పరికరాల హోమ్ డెలివరీ
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీకి సంబంధించిన సర్వీసులు
* పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్ రిటైల్, స్టోరేజ్ ఔట్ లెట్స్
* విద్యుదుత్పత్తి, ట్రాన్స్ మిషన్, పంపిణీ యూనిట్లు, సేవలు
సెబీ నోటిఫై చేసిన మేరకు క్యాపిటల్, డెబిట్ మార్కెట్ సర్వీసులు
ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ సర్వీసులు
* నిత్యావసర సరుకుల తయారీ సంస్థలు
* రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన తర్వాత నిరంతరాయంగా సాగాల్సిన ఉత్పత్తి యూనిట్లు
* నిత్యావసర సరుకుల రవాణా, ఫైర్, శాంతిభద్రతలు, అత్యవసర సర్వీసులు
* పర్యాటకుల కోసం, లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జీలు, మోటెల్స్. క్వారంటైన్ కు వాడే అత్యవసర సిబ్బంది, నావికా సిబ్బంది, సంస్థలు
* అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు
* రక్షణ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ
* పెట్రోలియం, సిఎన్జీ, ఎల్పీజీ, పిఎన్జీ వంటి ప్రజా వినియోగాలు
డిజాస్టర్ మేనేజ్ మెంట్, పోస్టాఫీసులు, పోలీసులు, హోమ్ గార్డులు, ఫైర్, అత్వసర సర్వీసులు, జైళ్లు
శిక్షలు
* ఫిబ్రవరి 15వ తేదీన భారత్ వచ్చిన వ్యక్తులందరూ తమంత తాముగా ఇళ్లలో క్వారెంటైన్ చేసుకోవాలి. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.
* విధులకు అడ్డు తగిలితే ఒకటి లేదా రెండేళ్ల జైలు లేదా జరిమానా
* తప్పుడు క్లెయిమ్ చేస్తే రెండేళ్ల వరకు జైలు, జరిమానా
* తప్పుడు హెచ్చరికలు చేస్తే ఏడాది వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు