ప్రభుత్వం తీరు: మన డాక్టర్లకు రైన్ కోట్లు, సెర్బియాకు మాత్రం ప్రొటెక్టీవ్ గేర్

డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నప్పుడు వారికి సరైన రక్షణ కల్పించడం అవసరం. ట్రీట్మెంట్ చేసేప్పుడు మాస్కులు, పూర్తి స్థాయి సూట్, హజమత్ సూట్ ఇవ్వడం అత్యవసరం. వారికి ఆ రక్షణ సామగ్రి గనుక ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయమంటే.... అది కత్తి లేకుండా సైనికుడిని యుద్ధానికి వెళ్ళమనడమే!

India exports COVID-19 Protective Gear To Serbia Amid Huge Shortage nationwide

కరోనా మహమ్మారి విలయ తాండవం ధాటికి ప్రపంచం కుదేలవుతోంది. ఈ కంటికి కనిపించని వైరస్ తో యుద్ధంలో ముందు వరుసలో ఉంటూ పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి దేశంకోసం, దేశ ప్రాజాల కోసం  కష్టపడుతున్నారు. 

ఇలాంటి మహమ్మారిపై పోరులో డాక్టర్లు భారతదేశానికి ఇప్పుడు అత్యవసరమైన వనరులు. ఒకరకంగా వైద్య సిబ్బంది లేకపోతే... ఈ కారొనపై ఏ దేశం కూడా పోరు సాగించలేదు. సాగించి గెలవలేదు. ఇలాంటి ఆపత్కాలీనా పరిస్థితుల్లో మన వైద్య సిబ్బందిని రక్షించుకోవద్దం, కాపాడుకోవడం మన బాధ్యత. 

అలాంటి డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నప్పుడు వారికి సరైన రక్షణ కల్పించడం అవసరం. ట్రీట్మెంట్ చేసేప్పుడు మాస్కులు, పూర్తి స్థాయి సూట్, హజమత్ సూట్ ఇవ్వడం అత్యవసరం. వారికి ఆ రక్షణ సామగ్రి గనుక ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయమంటే.... అది కత్తి లేకుండా సైనికుడిని యుద్ధానికి వెళ్ళమనడమే!

కానీ మన డాక్టర్లకు దేశంలో చాలా చోట్ల కనీసం ఇలాంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండానే ఉన్న అరకొర వసతులతోనే వారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి రక్షణ పరికరాలు ఇవ్వమంటే..రైన్ కోట్లు, కండ్లకు సన్ గ్లాసులు, దుప్పట్లతో తయారు చేసిన మాస్కులు. 

Also Read దేశానికి నిజాముద్దీన్ గండం.. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారి ఆచూకీ కోసం.....

పేషెంట్లతో అత్యధికసేపు గడిపేది డాక్టర్లే. వారికి అత్యవసరమైనవి ఎన్- 95 మాస్కులు. వారికి అవి ఇవ్వకుండా ఇలా ట్రీట్మెంట్ చేయమని కోరడం అసలు భావ్యం కాదు. 

కానీ ఇలా సేవలందించే డాక్టర్లు ఏకంగా 100 మంది కరోనా వైరస్ బారినపడి ఐసొలేషన్ వార్డుల్లో ఉన్నప్పుడు వారు మాకు రక్షణ సూట్లు అందించండి అనడంలో ఎటువంటి తప్పు లేదు. 

దేశంలో అటు శ్రీనగర్ నుంచి ఇటు చెన్నై వరకు, అటు గుజరాత్ నుంచి బెంగాల్ వరకు అందరూ ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్కవీరేమో ఇలా మాకు కనీస రక్షణ పరికరాలు ఇవ్వండి అంటూంటేనేమో, అటు పక్క  సెర్బియా దేశానికి మాస్కులు, గ్లవుజులు, తదితరాలను అమ్మారు. 

ఈ విషయాన్నీ నేరుగా సెర్బియా దేశంలోని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చెప్పింది. వారే స్వయంగా ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతే కాకుండా రెండు రోజులకింద మరో రౌండ్ 35 టన్నుల ఇలాంటి మాస్కులను గ్లవుజులను పంపించినట్టు కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. 

ఇలా ఆపత్కాలీనా పరిస్థితుల్లో మన వైద్యసిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే.... వారికి కనీస ప్రొటెక్టీవ్ గేర్ ఇవ్వకుండా అధికారులు చోద్యం చూస్తూ... హజమట్ సూట్లకు బదులు రైన్ కోట్లు ఇస్తూ వారి ప్రాణాలను ఇరుకున పెట్టడం ఒకెత్తయితే... వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం ఇంకొక ఎత్తు. ఇది చాలా బాధాకరం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios