కరోనా: ముంబై ధారావిలో ఏడుగురికి పాజిటివ్, రాష్ట్రంలో 891కి చేరిన కేసులు
మహారాష్ట్ర ముంబై ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకి చేరుకొన్నాయి..దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. నిజాముద్దీన్ నుండి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
ముంబై: మహారాష్ట్ర ముంబై ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకి చేరుకొన్నాయి..దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. నిజాముద్దీన్ నుండి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో రాష్ట్రంలో తాజాగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 891కి చేరుకొన్నాయి. 24 గంటల్లోనే 110 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
థారావి ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనా తో మృతి చెందాడు. మృతుడి సోదరుడికి తండ్రికి కూడ కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. ధారావిలో ఉంటున్న ఏడుగురికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
మర్కజ్ నుండి వచ్చిన పదిమంది ధారావి ప్రాంతానికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి కారణంగానే ఈ ప్రాంతంలో కరోనా వైరస్ సోకిందనే అభిప్రాయాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు
కేరళకు చెందిన వీరంతా ఢిల్లీ నుండి ముంబైకి చేరుకొని ఇక్కడి నుండి తిరిగి కేరళకు వెళ్లినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీరి ట్రావెల్ హిస్టరీని కూడ అధికారులు సేకరిస్తున్నారు. వారందరికి కూడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు.
మంగళవారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరుకొన్నాయి. 24 గంటల్లో 354 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో దేశంలో 117 మంది మృతి చెందారు.