లాక్‌డౌన్ ఎఫెక్ట్: సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం కొత్త స్కీమ్

కరోనా లాక్ డౌన్ వేళ పని లేక, ఉత్పత్తి జరుగక, ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు చెల్లించలేని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల బ్యాంకులు మంజూరు చేసే రుణాలతో ఎంఎస్ఎంఈలు తమ సిబ్బందికి వేతన చెల్లింపులకు అవకాశం ఏర్పడింది. 
 

Government mulls credit guarantee scheme for loans for payment of wages by MSMEs

న్యూఢిల్లీ: క‌రోనావైర‌స్‌తో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ఉద్దీప‌న ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్యాకేజీలు ప్ర‌క‌టిస్తోంది. దీనిలో భాగంగా కార్మికుల వేత‌నాలు చెల్లించేందుకు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌(ఎంఎస్ఎంఈ)లకు బ్యాంకులు అద‌నంగా 10 నుంచి 15 శాతం వ‌ర్కింగ్ మూల‌ధ‌న పెట్టుబడిని అందించేందుకు, క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంది.

ఎంఎస్ఎంఈ సంస్థలకు ప్ర‌స్తుతం బ్యాంకులు వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ప‌రిమితి ఆధారంగా 10 శాతం అద‌న‌పు రుణాన్ని అందిస్తున్నాయి. ఈ రుణాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. 

కరోనా ‘లాక్‌డౌన్’ వల్ల దేశంలో చాలా ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. గ‌త రెండు నెల‌లుగా ఎటువంటి ప‌నులు జ‌ర‌గ‌లేదు. దీంతో ఎంఎస్ఎంఈలకు కార్మికుల‌ వేత‌నాలు చెల్లించేందుకు వాటి యాజమాన్యాలకు క‌ష్టంగా మారింది.

వారికి ఆర్థిక స‌హాయం చేయ‌డానికి గల అవకాశాలను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. వ్య‌వ‌సాయ రంగం త‌రువాత దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎంఎస్ఎంఈ రంగం ఉంది. ప్ర‌తిపాదిత క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ద్వారా బ్యాంకులు మ‌ద్ద‌తు ఇస్తాయి. ఏదైనా రుణ‌గ్ర‌హిత డిఫాల్ట్ అయిన‌ప్పుడు రుణ‌దాత‌ల డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది.

also read ఆ ఉద్దీపనతో నో యూజ్: కరోనా క్రైసిస్ అసాధారణం.. ఆర్బీఐ మాజీ గవర్నర్

ప‌రిశ్ర‌మ‌ల మ‌నుగ‌డ కోసం డ‌బ్బులు అందించ‌డానికి కరోనా ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ పెసిలిటీ కింద లాక్‌డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి, కార్పోరేట్ల‌కు రూ.42,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఎంఎస్ఎంఈ రంగం జీడీపీలో 28శాతం, 40శాతం ఎగుమ‌తుల‌కు దోహ‌దం చేస్తున్నది. 

ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మందికి ఉపాధి క‌ల్పిస్తున్నాయి. ఆర్బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎంఎస్ఎంఈలు, కార్పోరేట్ సంస్థలు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెల‌ల మారిటోరియం కూడా పొందాయి. ఈ మారటోరియం వల్ల 3.2 కోట్ల మంది రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

గత మార్చి, ఏప్రిల్ నెలల్లో వివిధ కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు బ్యాంకులు రూ.5.66 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా ‘లాక్ డౌన్’ ఎత్తివేసిన తర్వాత సంబంధిత రుణ గ్రహీతలకు రుణాలు పంపిణీ చేస్తారని చెప్పారు.

ఇప్పటివరకు ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రూ.27,426 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.14,735 కోట్ల రుణాలందాయి. 10 లక్షల ఎంఎస్ఎంఈ సంస్థలు, 6,428 కార్పొరేట్ సంస్థలు రుణాలు పొందాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios