Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ తొలి చిత్రాన్ని విడుదల చేసిన భారత్, ఆసక్తికర విషయాలు...

తాజాగా భారతదేశం కూడా ఈ వైరస్ కి సంబంధించిన తొలి చిత్రాన్ని విడుదల చేసింది. వుహాన్ లో కనిపించిన వైరస్ తో ఈ వైరస్ 99.8 శాతం సరిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

First Images Of Coronavirus Released from India
Author
Pune, First Published Mar 28, 2020, 10:27 AM IST

కరోనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. భారతదేశంపై కూడా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండడంతో భారతప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇకపోతే ఈ వైరస్ కి ఇప్పటివరకు మందు లేదు. ఏ దేశంవారు ఆ దేశానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మనదేశంలో హెచ్ఐవి కి ఇచ్చే మందులను ఇస్తున్నారు. దానితోపాటుగా ఐసిఎంఆర్ కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే... మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఇవ్వాలని సూచించింది. ఇలా ఒక నిర్దిష్టమైన మందు లేకున్నప్పటికీ... ప్రాణాలను రక్షించుకోవడానికి అన్ని దేశాలు తమకు తోచిన రీతిలో ప్రయత్నిస్తున్నాయి. 

ఇకపోతే మందు తాయారు చేసే ముందు దాని పూర్తి స్వభావాన్ని, ఆ వైరస్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. ఇంకా ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ పనిలో నిమగ్నమయి ఉన్నాయి. 

తాజాగా భారతదేశం కూడా ఈ వైరస్ కి సంబంధించిన తొలి చిత్రాన్ని విడుదల చేసింది. వుహాన్ లో కనిపించిన వైరస్ తో ఈ వైరస్ 99.8 శాతం సరిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వైరస్ ని గుర్తించారు. 

భారత్ నుండి తొలిసారిగా ఎలెక్ట్రాన్ ట్రాన్స్మిషన్ మైక్రోస్కోప్ నుండి ఈ చిత్రాన్ని తీసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.  ఈ కరోనా వైరస్ కొత్తది కాదు. దీన్ని మనం ఇదివరకు చాలాసార్లు చూసాము. కరోనా అంటే... లాటిన్ భాషలో టోపీ. అంటే ఒక వైరస్ చుట్టూ ఒక టోపీ ఉంటుందని దాని అర్థం. 2003లో హాంగ్ కాంగ్ లో సార్స్ గా కనబడింది. 2012లో ఇది మిడిల్ ఈస్ట్ లో మెర్స్ గా వచ్చింది. ఇప్పుడు 2020లో చైనాలో కోవిడ్ గా మనకు కనపడుతుంది. ఈ మూడు ఒకే కుటుంబానికి చెందినవి.

ఇకపోతే ఈ వైరస్ హైదరాబాద్ ను కూడా పట్టి పీడిస్తుంది. దీని ప్రభావాన్ని సాధ్యమైనంత మేర అరికట్టడానికి.... గ్రేటర్ హైదరాబాదులో ఐదు ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. తొలిసారి రెడ్ జోన్లను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కోకాపేట, కోత్తపేట, చందానగర్, గచ్చిబౌలి, తుర్క యంజాల్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. 14 రోజుల పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లకే రేషన్, నిత్యావసర సరుకులు అందించనున్నారు. 

Also Read: కరోనా లాక్ డౌన్: మద్యం దొరకడం లేదని భవనం నుంచి దూకి ఆత్మహత్య

ప్రజలు ఇళ్లకే ప్రజలు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. 14 రోజుల పాటు కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఈ ప్రాంతాలకు రాకూడదు. ఈ ప్రాంతాలకు చెందినవారు ఇళ్లలోంచి బయటకు రావద్దు.

వంటగ్యాస్ సిలిండర్లకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. దీంతో బుక్ చేసిన 15 రోజులకు గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

శుక్రవారం ఒక్క రోజే పది కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి పెరిగాయి. ప్రతి రోజూ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తూనే ఉన్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios