పిల్లల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కొత్త యాప్...
ఫేస్‌బుక్ ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండే పిల్లల కోసం ఫేస్‌బుక్ మెసెంజర్ కిడ్స్ యాప్ ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో ఒక కొత్త సర్వీస్ ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యధిక యూసర్లు కలిగిన ఉన్న ఫేస్‌బుక్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక యాప్ ప్రవేశపెట్టింది.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆమెరికా, ఇటలి, ఇండియా సైతం స్తంభించి పోయింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకుందుకు లాక్ డౌన్ ప్రవేశపెట్టింది. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్తితి. దీంతో చాలా వరకు ప్రజలు సోషల్ మీడియాపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఫేస్‌బుక్ ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండే పిల్లల కోసం ఫేస్‌బుక్ మెసెంజర్ కిడ్స్ యాప్ ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆండ్రోయిడ్ యూసర్ల కోసం ఈ వారంలో గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది.
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం మరింత పెరుగుతోందని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని వివరించింది. ఈ యాప్ సంబంధించి ఫీచర్ల పై ఎలాంటి సమాచారం లేదు.