మోడీకి షాక్: లైట్లు ఆర్పొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చిన విద్యుత్ శాఖా మంత్రి

ఆదివారం నాడు రాత్రి  9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపివేయాలన్న సూచనపై పునరాలోచన చేయాలని లేదంటే అత్యసర సేవలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్  ప్రజలను రిక్వెస్ట్ చేసారు. 

Electricity minister nitin Raut defers PM call and asks people not to turn off the lights

కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉదయం ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని  కోరారు. 

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు. 

ఇలా గనుక లైట్లను ఆర్పేస్తే చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని చాలా రాష్ట్రాల విద్యుత్ బోర్డులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. మహారాష్ట్ర సర్కార్ ఏకంగా లైట్లు బంద్ చేయొద్దు అని ప్రజలకు పిలుపునిచ్చింది. 

ఇలా పిలుపునిస్తూ... మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు, ఆదివారం నాడు రాత్రి  9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపివేయాలన్న సూచనపై పునరాలోచన చేయాలని లేదంటే అత్యసర సేవలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉందని ఆయన ప్రజలను రిక్వెస్ట్ చేసారు. 

ఒకేసారి అన్ని లైట్లను ఇలా కట్టేసే ముందు పునరాలోచించాలనీ, ఇది గ్రిడ్ షట్ డౌన్ కు దారితీయొచ్చని ఆయన అన్నారు.ఇలా గనుక చేస్తే 15 నుంచి 16 గంటలపాటు గ్రిడ్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. 

ఒకే మారు లోడ్ ని తగ్గియలేరు. అది చేయాలాఅంటే... దాదాపుగా ఒక గంట ముందు నుంచే లోడ్ షెడ్డింగ్ ఆరంభించవలిసి ఉంటుంది. అంటే 8 గంటలా నుంచి నెమ్మది నెమ్మదిగా పవర్ కట్స్ మొదలుపెట్టాలి. 

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఫ్రీ గవర్నింగ్ మోడ్ లో ఉంచి విద్యుత్ ఉత్పాదనను సాధ్యమైనంత మేర తగ్గించమని చెప్పాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 3000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుందని అంచనా. 

ఒక్క రాష్ట్రంలోనే ఇలా 3000 మెగావాట్ల అంటే... దేశం మొత్తంలో ఊహించవచ్చు. రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కనీసం ఉదయం వరకు ఇళ్లలో కరెంటు ఉండదు. 

ఇలా కరెంటు గనుక ఆగిపోతే, ప్రజల తీవ్రమైన కష్టాలు పడుతారు. ప్రజల కష్టాలు అటుంచితే... 24 గంటలు ఇప్పుడు ప్రజల అవసరాల కోసం పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల మీద అదనపు భారం పడుతుంది. కరోనాపై జరుపుతున్న అలుపెరుగని పోరాటానికి కూడా ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. రోడ్లపైన లైట్ల నుండి ఆసుపత్రుల్లోని ఐసీయూల వరకు అన్నిటికి ప్రమాదం పొంచి ఉంది అని నితిన్ రౌత్ అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios