Asianet News TeluguAsianet News Telugu

హెచ్-1 బీ వీసాదారులకు బ్యాడ్ న్యూస్..అమెరికాలో వీసాల జారీపై నిషేధం...

కరోనా విలయం ప్రభావం అమెరికాలో విదేశీయులకు ఇచ్చే హెచ్-1బీ వీసాదారులకు ఇచ్చే కొలువులపై పడింది. అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడమే దీనికి నేపథ్యం. హెచ్-1 బీ వీసాదారులకు వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 
 

Donald Trump administration working on temporary ban on visas like H-1B: Report
Author
Hyderabad, First Published May 9, 2020, 12:42 PM IST

వాషింగ్టన్‌: అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా డొనాల్డ్ ట్రంప్‌ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కరోనా కల్పించిన సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగం పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా జారీ చేసే వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విషయమై ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్స్‌ ఈ మేరకు విధివిధానాలు, ప్రణాళికలు రచిస్తున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం పేర్కొన్నది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్‌-1 బీ‌, హెచ్‌-2 బీ వీసా సహా విద్యార్థి వీసాలపై కూడా దీని ప్రభావం పడనుందని ఆ వార్తాకథనం పేర్కొన్నది. 

‘వర్క్‌ బేస్డ్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించేలా అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వీసాల జాబితాలో హెచ్‌-1 బీ, హెచ్‌-బీ, విద్యార్థి వీసాలు కూడా మమేకమై ఉంటాయి’’ అని సదరు మీడియా కథనం వ్యాఖ్యానించింది.  

also read ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా వైరస్... కార్యాలయం మూసివేత..

కాగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లో నేపథ్యంలో తమ దేశంలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని.. ఇది కేవలం గ్రీన్‌కార్డు కోరుకునే వారి​కి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికాలోని హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలు ఇవ్వవద్దని ట్రంప్‌ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని న్యాయస్థానానికి తెలిపింది.

హెచ్‌4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్‌ ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన వివరించింది. కాగా హెచ్‌-1 బీ వీసాతో దాదాపు ఐదు లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios