Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్భంధంలోకి సీఆర్‌పీఎఫ్ డీజీ


సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ ఏపీ మహేశ్వరి స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. సీఆర్‌పీఎఫ్ ముఖ్య వైద్య అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

 

CRPF DG goes into self-quarantine after force doc tests Covid-19 +ve: Report
Author
New Delhi, First Published Apr 5, 2020, 2:45 PM IST


న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ ఏపీ మహేశ్వరి స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. సీఆర్‌పీఎఫ్ ముఖ్య వైద్య అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

సీఆర్‌పీఎఫ్ చీఫ్ తో పాటు వైద్యుడితో సన్నిహితంగా ఉన్న మరో 20 మందిని కూడ  క్వారంటైన్ కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో వారంతా కూడ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు.  వీరి నమూనాలను కూడ అధికారులు సేకరించారు. ఈ శాంపిల్స్ రిపోర్టు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

also read:కరోనా: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్

సీఆర్పీఎఫ్ చీఫ్ ముఖ్య వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గురువారం నాడు తేలిన విషయం తెలిసిందే.అడిషనల్ డైరెక్టర్ జనరల్ (మెడికల్) ఆర్మ్‌డ్ పోలీస్ పోర్సెస్ విభాగానికి ఈ వైద్యాధికారిని అటాచ్జ్ చేశారు. ఈ విభాగం హోం శాఖతో పాటు పారా మిలటరీ విభాగాల్లో వైద్య సేవలను పర్యవేక్షించనుంది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులను తగ్గించేందుకు కేంద్రం కూడ అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.ఈ నెల 21వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios