నర్సులతో అసభ్య ప్రవర్తన... జమాత్ సభ్యులపై ఆ చట్టం ప్రయోగం: యోగి కీలక నిర్ణయం

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు, దురుసు ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది

Coronavirus: Yogi Adityanath's Tough Move Against quarantined tablighi jamaat members over obscene conduct

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు, దురుసు ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో మహిళా నర్సుల పట్ల ఆరుగురు తబ్లీగి జమాత్ సభ్యులు అభస్యంగా ప్రవర్తించారు.

దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ చట్టం ప్రకారం తప్పు చేశారని రుజువైతే, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే ఏడాది పాటు అదుపులోకి తీసుకోవచ్చు.

Also Read:కరోనా రోగుల శాడిజం... నగ్నంగా తిరుగుతూ, నర్సులకు వేధింపులు

వాళ్లు చట్టాన్ని అనుసరించరు.. ఆదేశాలను అంగీకరించరు, మానవత్వానికి శత్రువులని యోగి వ్యాఖ్యానించారు. మహిళా వైద్య సిబ్బంది పట్ల వారు ప్రవర్తించిన తీరు శిక్షార్హం. వీరిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నామని, వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలేది లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడి చేసిన లాంటి ఘటనలు మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించొద్దని, ఇందుకోసం చట్ట ప్రకారం ఏ చర్యనైనా తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

Also Read:కరోనా వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ: గతంలో స్వైన్ ఫ్లూకి కూడా...

కాగా దేశంలో నమోదవుతున్న కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్‌కు సంబంధం ఉందని తేలడంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సదస్సుకు హాజరైనవారి వివరాలను సేకరించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

ఘజియాబాద్‌కు చెందిన 136 మంది తబ్లీగ్ జమాత్‌లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఆరుగురికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఎంఎంజీ హాస్పిటల్‌లో చేర్పించగా పరీక్షలు చేయించారు. ఒకరికి పాజిటివ్ అని తేలింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios