ఏపీ సీఎం వైఎస్ జగన్ కి థ్యాంక్స్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. ఆయన మీడియా ముఖంగా కూడా ప్రజలను దీపాలను వెలిగించమని కోరారు.
కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని కోరారు.
నేడు, ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కట్టేసి, ఎవ్వరి బాల్కనీల్లోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు.
జాతి యావత్తు ఏకమై ఈ కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తుందని సంఘీభావం తెలపడంతో పాటుగా ఈ కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు, కరోనా చీకట్లను తరిమేయడానికి ఈ వెలుగులు పనిచేస్తాయని ప్రధాని పిలుపునిచ్చారు.
కరోనా కల్లోలం: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సాక్షిగా జగన్ చుట్టూ వివాదం, అసలు విషయం ఇదీ !
ప్రధాని ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. ఆయన మీడియా ముఖంగా కూడా ప్రజలను ఇలా దీపాలను వెలిగించమని కోరారు.
"ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించండి. ముంచుకొస్తున్న ఈ కరోనా చీకట్లను దీపాలను వెలిగించడం ద్వారా వచ్చే అనంతమైన ప్రకాశంతో పారద్రోలుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ చీకట్లపై మనం త్వరలోనే విజయం సాధించి, మరింత ఐక్యతతో, మరింత ధృడంగా దూసుకెళ్తాము" అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసారు.
జగన్ మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలకు పిలుపునివ్వడం ఎంతో స్ఫూర్తిదాయకమైందని, మన ఐక్యతా శక్తిని ఇది మరింత పెంపోందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి గారికి థాంక్స్ కూడా చెప్పారు.