భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. మామూలుగా అయితే 7.2 రోజుల్లో రెట్టింపవ్వాల్సిన కేసులు నిజాముద్దీన్ ఘటన వల్ల దాదాపుగా 4 రోజుల్లోనే రెట్టింపవుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. 

భారత్ లో కరోనా కేసులు నాలుగువేల దాటాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం 20 కరోనా హాట్ స్పాట్లను గుర్తించింది. అక్కడ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండి, కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు హాట్ స్పాట్లుగా ప్రకటించింది. 

ఇప్పటివరకు 3577 మందికి ఈ కరోనా వైరస్ సోకగా అందులో కనీసం 83 మంది మరణించారని, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిన్నొక్కరోజే 577 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 321 మంది కోలుకున్నారు. 

రాష్ట్రాల వారీగా గనుక లెక్కలు తీసుకుంటే... మహారాష్ట్రలో 490 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ కరోనా వల్ల 45 మంది మృతి చెందారు. 


తమిళనాడు లో ఇప్పటివరకు 485 పాజిటివ్ కేసులు నమోదవగా, ఐదుగురు మృతి చెందారు. ఇక ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. ఢిల్లీలో ఇప్పటివరకు 503 కేసులు నమోదవ్వగా, ఏడుగురు మృతి చెందారు. 

కేరళలో 306 పాజిటివ్ కేసులు నమోదవగా,ఇద్దరు మృతి చెందారు. తెలంగాణ 334 కేసులు నమోదవగా,11 మంది ఇప్పటివరకు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో 227 కేసులు నమోదవగా,ముగ్గురు మృతి చెందారు. 

రాజస్థాన్ లో 200 కేసులు నమోదవగా,ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో 255 కేసులు నమోదవ్వగా, ఒకరు మృతి చెందారు. మద్యప్రదేశ్ లో 165కేసులు నమోదవగా ,12 మంది మృతి చెందారు.