జీవితాంతం గుర్తుండాలని: పిల్ల పేరు కరోనా, పిల్లాడి పేరు లాక్‌డౌన్
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా పేరు మారుమోగుతోంది. దేవుడి పేరు కూడా తలచుకోనంతగా జనం కరోనాను తలచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మహమ్మారి ముప్పు తొలగుతుందా, లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా అని ప్రపంచం ఎదురుచూస్తోంది.
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా పేరు మారుమోగుతోంది. దేవుడి పేరు కూడా తలచుకోనంతగా జనం కరోనాను తలచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మహమ్మారి ముప్పు తొలగుతుందా, లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా అని ప్రపంచం ఎదురుచూస్తోంది.
అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు తమ సంతానానికి కరోనా, లాక్‌డౌన్ అని పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. దొయిరా జిల్లా కుకుండు గ్రామానికి చెందిన దంపతులు లాక్‌డౌన్ అని పేరు పెట్టారు.
Also Read:లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారి కోసం జైళ్లు రెడీ
ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి పోయింది. దీనిపై లాక్‌డౌన్ తండ్రి మాట్లాడుతూ.. మా అబ్బాయి లాక్‌డౌన్ సమయంలో పుట్టాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్‌డౌన్ విధించి ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు.
జాతి ప్రయోజనం కోసం లాక్‌డౌన్ విధించిన మోడీని అభినందించి మా బాబుకి ఆ పేరు పెట్టామని ఆయన చెప్పారు. అలాగే లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు నవ శిశువును చూడటానికి ఎవ్వరూ తమ ఇంటికి రావొద్దని, ఇంటికే పరిమితం అవ్వాలని ఆయన కోరారు.
Also Read:మర్కజ్ చిక్కులు: ఐదు రైళ్లు ఇవే, వేలాది మంది ప్రయాణికులపై ఆరా
కాగా కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందని ఓ వ్యక్తి తన మేనకోడలికి కరోనా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ వ్యక్తి మాట్లాడుతూ.. కరోనా వైరస్ జాతిని ఏకతాటిపైకి వచ్చి పోరాడేలా చేస్తోంది.
కోవిడ్ 19 ప్రమాదకారి అనడంలో ఎలాంటి సందేహం లేదు, దాని కారణంగా వేలాది మంది చనిపోయారు కూడా. కానీ ఈ వైరస్సే మనకు మంచి అలవాట్లను నేర్పిందని ఆయన అన్నారు. తన మేనకోడలు చెడుకు వ్యతిరేకంగా ఐకమత్యంగా చేసే పోరాటానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.