కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ లో అందరూ తమ కర్తవ్యాలను పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. కేవలం వైద్యులు, జర్నలిస్టులు మాత్రమే పనులు చేస్తున్నారు. వారికి ప్రజలు జేజేలు కొడుతున్నారు. అయితే.. వీరితో పాటు మరికొందరు కూడా విధులు నిర్వహిస్తున్నారు. వారే.. పారిశుధ్య కార్మికులు.

 

ఎవరూ బయటకు అడుగుపెట్టకపోయినా.. ఇంట్లో మాత్రం చెత్త పేరుకు పోతుంది కదా. దానిని తీయకపోతే మరిన్ని రోగాలు అంటుకుంటాయి. అందుకే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ముఖానికి మాస్క్ లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. వారి కష్టానికి ప్రజలు అభినందనలు తెలిపారు. కార్మికులపై డబ్బు, పూలతో వర్షం కురిపించారు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read యూపీలో తొలి కరోనా మరణం.. ముంబయి వెళ్లిన విషయం దాచి...

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రమిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అంతేకాకుండా.. అతని మెడలో నోట్ల దండలు వేసి.. అతని సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ ఘటన పంజాబ్‌లోని పటియాల జిల్లాలో నభా కాలనీలో జరిగింది. క్రమం తప్పకుండా తమ వీధిలోకి వచ్చి చెత్తను సేకరించే ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. లాక్‌డౌన్ సమయంలోనూ తన విధులను మర్చిపోలేదు. దీంతో అతనికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీ వాసులు.. అతనిపై పూల వర్షం కురిపించారు. కొందరైతే ఏకంగా నోట్ల కట్టలు మెడలో వేసి అభినందించారు.