Asianet News TeluguAsianet News Telugu

వలస కార్మికులపై అమానుషం: రోడ్డుపై వరుసగా కూర్చోబెట్టి రసాయనాలు స్ప్రే

సరిహద్దులను ధాటి రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వలస కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. అంరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, రసాయనాలతో పిచికారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

coronavirus : lockdown migrants doused with sanitisers chemicals in Uttar Pradesh
Author
Lucknow, First Published Mar 30, 2020, 3:33 PM IST

నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద  సంచులతో వలస కార్మికులు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలతో భారతదేశం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

గమ్య స్థానం ఎప్పుడొస్తుందో తెలియదు, ఇల్లు చేరతామో లేదో తెలియదు. కానీ ప్రాణాలు  కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో బాధను పంటి బిగువున నొక్కిపెట్టి వందల కిలోమీటర్లు నడుస్తున్నారు.

Also Read:కరోనా మాయ... నో సెలూన్, ఎవరి జుట్టు వాళ్లే..

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా సొంత రాష్ట్రానికి చేరుకున్న వారికి కొన్ని చోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. సరిహద్దులను ధాటి రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వలస కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తించారు.

అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, రసాయనాలతో పిచికారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వలస కార్మికులను ప్రస్తుతం ఉంటున్న చోటే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:కరోనా లాక్ డౌన్... నన్ను రక్షిస్తోంది ఇదే.. మోదీ వీడియో

అయితే కొందరు మాత్రం నగరాల్లో బతుకుదెరువు లేక సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో గంజి నీళ్లు తాగైనా బతకవచ్చని వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. అలా వచ్చిన వారిని నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచాలి.

కానీ ఉత్తరప్రదేశ్ అధికారులు మాత్రం అలా చేయకుండా, అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి రసాయనాలు చల్లారని మండిపడుతున్నారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చి దేశంలోకి కరోనా వైరస్ తీసుకొచ్చిన వారికి రాచమర్యాదలు చేస్తున్న ప్రభుత్వాలు.. వలస కార్మికుల పట్ల మాత్రం అమానుషంగా  ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios