కరోనా అలర్ట్: భారత్ లో స్టేజి 3కి కరోనా...
ఈ కరోనా వైరస్ ప్రస్తుతం వరకు కూడా రెండవ దశలోనే ఉందని అందరం అనుకుంటున్నాం. కాకపోతే... ఈ వైరస్ ఇప్పుడు మూడవదశలోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుందని ఈ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ డాక్టర్ గిరిధర్ గియాని అన్నారు.
కరోనా అని మామూలుగా అనడం కంటే...ఇప్పుడు ఈ వైరస్ ని మహమ్మారి అని పిలవడం కరెక్ట్ ఏమో! ఈ వైరస్ విలయతాండవానికి భారత్ వణికిపోతుంది. ఇటలీ, అమెరికాలు వచ్చిన పరిస్థితి రాకూడదని ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే... ఈ కరోనా వైరస్ ప్రస్తుతం వరకు కూడా రెండవ దశలోనే ఉందని అందరం అనుకుంటున్నాం. కాకపోతే... ఈ వైరస్ ఇప్పుడు మూడవదశలోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుందని ఈ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ డాక్టర్ గిరిధర్ గియాని అన్నారు.
మొన్న 24వ తేదీనాడు ఆయన ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్క్యూలో కూడా పాల్గొన్నారు. ఆయన అక్కడ కూడా ప్రధానితో ఇదే విషయాన్నీ చెప్పినట్టు తెలియవస్తుంది. ఒక ఇంగ్లీష్ మీడియా హౌస్ కి ఇచ్చిన టెలీఫోనిక్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విస్తుపోయే వాస్తవాలను చెప్పారు.
Also Read వియత్నాంను చూసి నేర్చుకోవాలి.. చిన్నదేశమైనా..కరోనాని జయించింది...
మున్ముందు వారాల్లో ఎప్పుడైనా ఈ వైరస్ విజృంభించే ప్రమాదముందని రానున్నవారం పది రోజులు అత్యంత కీలకం అని ఆయన అన్నారు. స్టేజి 3 ఇప్పుడిప్పుడే మొదలవుతున్న లక్షణాలున్నాయని ఆయన అన్నారు. ఇందుకోసం ఇంకా భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
స్టేజి 3 అంటే....
ఈ కరోనా వ్యాప్తి మూడు దశల్లో ఉంటుంది. తొలిదశలో ఈ వైరస్ ని నేరుగా సోర్స్ నుంచి అంటించుకొని దేశంలోకి వచ్చినవారు. వీరిద్వారా వారి చుట్టూ ఉన్నవారికి పాకడాన్ని స్టేజి 2 అంటాము.
స్టేజి 3 లో అసలు కరోనా తీసుకువచ్చిన వ్యక్తి అక్కడ లేకున్నప్పటికీ అతను అంటించిన వ్యక్తిద్వారా ఇతరులకు పాకడం స్టేజి 3. ఇప్పుడు భారతదేశం స్టేజి 3 లోకి ప్రవేశిస్తుందని అన్నారు.
ఇటలీ, అమెరికాలో ఇలా స్టేజి 3 కాలంలోనే తగినన్ని జాగ్రత్తలు తీసుకోక భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది. భారతదేశంలో ఇప్పుడు సరిపడా ఆసుపత్రులు లేవు. ఒకవేళ గనుక రానున్న రోజుల్లో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లమీదకు వస్తే... కరోనా వైరస్ కరాళ నృత్యం గ్యారంటీ అంటున్నారు డాక్టర్లు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు కేవలం అన్ని లక్షణాలున్న వారినే కాకుండా ఒక్క లక్షణం ఉన్నా కూడా టెస్ట్ చేయాలి. కేవలం జ్వరం మాత్రమే ఉంటె వారిని కరోనా టెస్ట్ కి పంపడం లేదు. అందరిలోనూ అన్నిసార్లు అన్ని లక్షణాలు కనబడాలని లేదు. ప్రస్తుతానికి జలుబు, జ్వరం, దగ్గు మూడు ఉంటేనే కరోనా పరీక్షలు చేస్తున్నారు.
అలా కాకుండా సాధ్యమైనంతమందిని టెస్ట్ చేసి అనుమానితులను, పేషెంట్స్ ని ఐసొలేషన్ వార్డులకు తరలించినప్పుడు మాత్రమే ఈ వైరస్ అదుపులో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.