న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదైనట్టుగా మంగళవారం నాడు ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 1251కు చేరుకొన్నాయి.కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిలో 32 మంది మృతి చెందితే, మరో 102 మందికి నయమైనట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

also read:కరోనా:తెలంగాణ నుండి ఢిల్లీకి వెళ్లింది 1030 మంది, ట్రాకింగ్ బృందాల ఆరా

ఢిల్లీ ఈవెంట్ కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో 25 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది.దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరినట్టుగా అధికారులు ప్రకటించారు. 

లోకల్ ట్రాన్స్ మిషన్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై నర్సులకు కూడ చికిత్స విషయంలో శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

ఆన్ లైన్ లో నర్సులకు నర్సులకు ఈ శిక్షణ ఇస్తామని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల నుండి వైద్య పరికరాలను తీసుకొస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. మాస్కులు, శానిటైజర్లకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందని కేంద్రం ప్రకటించింది.

కరోనాా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రైల్వే శాఖ కూడ ముందుకు వచ్చింది. సుమారు 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు ముందుకు వచ్చింది.

ప్రపంచంలో ఇవాళ్టికి 7,88, 522 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 37,878 మంది మృతి చెందినట్టుగా సమాచారం. మరో వైపు ఈ వ్యాధి సోకిన వారిలో 1,66,768 మంది రికవరీ అయినట్టుగా అధికారవర్గాలు ప్రకటించాయి.