Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఒక్క రోజే 478 కొత్త కరోనా కేసులు: 62కు చేరిన మృతులు

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 478 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. శుక్రవారంనాటికి దేశంలో 62 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు.

coronavirus, covid-19: Maharashtra worst-hit state due coronavirus; India death toll at 62
Author
New Delhi, First Published Apr 4, 2020, 7:38 AM IST

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. 

మహరాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు. 

ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios