Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థపై దాడి... అప్రమత్తమవడంతో తప్పిన ముప్పు...

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ మీద హ్యాకర్లు ‘మేజ్ రాన్సమ్ వేర్’ అనే నకిలీ సాఫ్ట్‌వేర్‍తో దాడి చేశారు. దీంతో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే లాక్‌డౌన్ వేళ హ్యాకర్ల సైబర్ దాడులు భారీగా పెరిగాయి.
 

corona virus lockdown: Cognizant  has been attacked cyber hackers on Friday night
Author
Hyderabad, First Published Apr 20, 2020, 11:35 AM IST

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్‌పై గుర్తు తెలియని సైబర్‌ నేరగాళ్లు నకిలీ సాఫ్ట్‌వేర్‌ ‘మేజ్‌’ రాన్సమ్ వేర్‌తో దాడి చేశారు. దీంతో కంపెనీకి చెందిన క్లయింట్‌ సేవలు కొన్నింటికి పెను అంతరాయం కలిగింది. భారత్‌లో కాగ్నిజెంట్‌లో  రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 

కాగ్నిజెంట్‌ దీనిపై ఒక ప్రకటన చేస్తూ కస్టమర్లందరినీ తాము నిరంతరం సంప్రదిస్తూ ఆ దాడిని నిలువరించే కొన్ని ఉపాయాలు, రక్షణాత్మకమైన సాంకేతిక సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. తాము ఈ విషయంలో సైబర్‌ చట్టాలను అమలుపరిచే అధికార యంత్రాంగంతోనా, అలాగే తమ అంతర్గత భద్రతా బృందాలు కూడా ప్రముఖ సైబర్‌ రక్షణ సంస్థల సహకారంతో ఈ దాడిని నిలువరించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొంది. 

తమ ఖాతాదారులు వారి కంప్యూటర్ వ్యవస్థ, డేటాను వినియోగించకుండా రాన్సమ్ వేర్ అడ్డు పడుతుంది. దీన్ని వినియోగించుకోవాలంటే డబ్బు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తుంటారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కాగ్నిజెంట్ సిద్ధమవుతున్నది. 

కరోనా లాక్‌‌‌‌డౌన్‌ వేళ హ్యాకర్లు, సైబర్ మోసగాళ్లు బిజీ అయ్యారు. చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో.. వారి సిస్టమ్‌‌‌‌లను హ్యాక్‌‌‌‌ చేయడంపై ఫోకస్ చేశారు. గత నెల 26న ఒక రాష్ట్రానికి చెందిన పన్నులశాఖను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌ చేశారని బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్‌‌‌‌సెక్‌‌‌‌ తెలిపింది. 

ఈ హ్యాకర్‌‌‌‌‌‌‌‌ గుజరాత్‌‌‌‌కు చెందిన రిమోట్ డెస్క్‌‌‌‌ టాప్‌‌‌‌ను, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ను యాక్సస్ చేసినట్టు ఈ కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. రష్యన్ హ్యాకర్ ఫోరమ్ ద్వారా సుమారు 800 గిగాబైట్స్ డేటాను అమ్మడానికి పెట్టినట్టు కూడా తెలిపింది. ఈ డేటాలో పాన్ కార్డుల వివరాలు, జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఈ–మెయిల్ అడ్రస్‌‌‌‌లు ఉన్నట్టు బ్లాగ్ పోస్ట్ పేర్కొంది. 

also read  ఆన్ లైన్ సేల్స్ పై నిషేధమా? క్లారిటీ లేని ఎన్నో అనుమానాలు...

అయితే ఆ హ్యాకర్ గురించి పెద్దగా సమాచారం ఏమీ తెలియదని, అతని నిక్‌‌‌‌నేమ్ ‘బాస్టర్‌‌‌‌‌‌‌‌లార్డ్’ అని పేర్కొంది. పెద్ద పెద్ద సంస్థలకు చెందిన రిమోట్ డెస్క్‌‌‌‌ టాప్ ఆక్సెస్‌‌‌‌ను అమ్మిన చరిత్ర అతనికి ఉందని వివరించింది. ఈ విషయంపై గుజరాత్ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ను సంప్రదించగా.. ఉన్నతాధికారులుఈ రిపోర్ట్ పూర్తిగా నిరాధారమని కొట్టేశారు. 

అయితే తమ ఎనాలసిస్‌‌‌‌లో ఆ డేటా అంతా రియల్‌‌‌‌దేనని తేలినట్టు క్లౌడ్‌‌‌‌సెక్ చెబుతోంది. ‘ట్రూకాలర్ ద్వారా ఫోన్ నెంబర్లను వెరిఫై చేశాం. వీరిలో చాలా మంది గుజరాత్‌‌‌‌కు చెందిన వారు. ఫోరమ్ పోస్ట్ తర్వాత రెండు రోజుల్లో, సర్వర్ ఆక్సెస్‌‌‌‌ను హ్యాకర్ కోల్పోయాడు’ అని క్లౌడ్‌‌‌‌సెక్ తన బ్లాగ్ పోస్ట్‌‌‌‌ లో పేర్కొంది.  

సాధారణ యూజర్ పేరు, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ను వాడుకుని కంప్యూటర్ లేదా నెట్‌‌‌‌వర్క్ ను హ్యాకర్ తన ఆధీనంలోకి తీసుకుంటాడని క్లౌడ్‌‌‌‌సెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ శశి తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి హ్యాకింగ్‌‌‌‌లు 15 శాతం పెరిగాయి. 2020 మార్చిలో 20 శాతం ఎగిశాయి. కరోనా సంబంధ స్కామ్‌‌‌‌లు మాత్రమే కాక.. డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ వెబ్‌‌‌‌సైట్, ఇతర హెల్త్‌‌‌‌ ఆర్గనైజేషన్స్, టెస్ట్ సెంటర్లు, ఆసుపత్రుల వెబ్‌‌‌‌సైట్లపై సైబర్ దాడులు జరుగుతున్నాయి. 

కరోనా మహమ్మారి తర్వాత గ్లోబల్‌‌‌‌గా హ్యాకింగ్‌‌‌‌లు బాగా పెరిగాయని మరికొన్ని రిపోర్ట్‌‌‌‌లు కూడా హెచ్చరిస్తున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ వెబ్‌‌‌‌సైట్ సీనెట్‌‌‌‌ విడుదల చేసిన తాజా రిపోర్ట్‌‌‌‌ లో కూడా ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి హ్యాకింగ్‌‌‌‌లు 15 శాతం పెరగగా.. ఒక్క మార్చిలోనే 20 శాతం ఎగిసినట్టు పేర్కొంది. చాలా మంది ప్రజలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, వారికి వారి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌‌లపై అంత కంట్రోల్ ఉండకపోవడంతో.. చాలా డేటా లీక్‌‌‌‌ అవుతుందని శశి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios