ఇండియా లాక్ డౌన్ లో లాభపడ్డది ఈయన ఒక్కడే...
ఈ కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా అమల్లోకి తీసుకొచ్చిన కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అంతే కాదు అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా వాణిజ్య పరంగా అన్నీ మూతపడ్డాయి.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని ఆగ్రా దేశాలతో పాటు అన్నీ దేశాలను వణికిస్తుంది. భారతదేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కూడా కరోనా వ్యాధికి గురవుతున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా అమల్లోకి తీసుకొచ్చిన కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
అంతే కాదు అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా వాణిజ్య పరంగా అన్నీ మూతపడ్డాయి.తాజాగా కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు మద్దతుగా డీమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు.
వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు మిగతా రూ. 55 కోట్లను 11 రాష్ట్రాలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ. 5 కోట్లు, ఏపీకి రూ. 5 కోట్లు ఇవ్వనున్నారు. అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేస్తామని ప్రకటించింది.
అలాగే సేవా కార్యక్రమాల కోసం మరో రూ. 4 కోట్లు ఇస్తామని, తమ సంస్థ ఉద్యోగులు మరో రూ. 4 కోట్లు ఇవ్వనున్నారని చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. విశేషం ఏంటంటే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుతో అన్నీ మూతపడనున్న సమయంలో ఢీ మార్ట్ కు స్టోర్లకు జనాలు క్యూ కట్టారు.
నిత్యవసర సరుకుల కోసం ఎగబడ్డారు. ఈ లాక్ డౌన్ వల్ల నిత్యవసర సరుకులకు కొరత ఏర్పడనున్నది అనే అపోహతో ముందుగానే మోతాదుకు మించి కొనుగోళ్ళు చేశారు. ఎవరికి కావాల్సింది వారికి అధిక మొత్తం కొని పెట్టుకున్నారు. దీంతో ఢీ మార్ట్ స్టోర్లు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
also read కరోనా వైరస్ అరికట్టేందుకు డీమార్ట్ అధినేత భారీ విరాళం
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చెప్పనవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఢీ మార్టూలో ధరలు కూడా కాస్త తక్కువ ఉంటాయి అనే పేరుతో ప్రతి ఒక్కరూ ఢీ మార్టూ ముందు క్యూ కట్టారు. దీంతో ఢీ మార్టూలకు ఎప్పుడు లేని విధంగా కస్టమర్ల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వచ్చిన వాళ్ళు దొరికిందల్లా పట్టుకెళ్లిపోయారు.
ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనే ముందస్తు జాగ్రతగా సరిపడే దానికి మించి తెచ్చిపెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ ఒక్క ఢీ మార్టుకు మాత్రమే కలిసొచ్చింది దీంతో అధిక లాభం పొందింది.
లాక్ డౌన్ వల్ల ఢీ మార్టూల్లో సేల్స్ భారీగా పెరగటంతో ఢీ మార్ట్ పేరు మారుమోగిపోయింది. కరోనా వైరస్ బారిన పడిన వారి కోసం ఒక వైపు విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఢీ మార్టూతో పాటు ఇంకా సీకే బిర్లా గ్రూప్ రూ. 35 కోట్ల విరాళం ప్రకటించింగా అందులో రూ. 25 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు, మిగతా రూ. 10 కోట్లు వైద్య పరికరాలు, మాస్కులు, పీపీఈలు కొనడానికి రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 5.65 కోట్లు విరాళం, నెస్లే ఇండియా రూ. 15 కోట్ల విరాళం, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది.