ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి కుదేలవుతున్నవేళ, ఈ మహమ్మారికి మందు కూడా లేకపోవడంతో లాక్ డౌన్ మాత్రమే దిక్కని భావించి ప్రపంచ దేశాలు ఆ దిశగా అడుగులు వేసాయి. 

భారతదేశం కూడా ఇదే బాటలో పయనిస్తూ, మన వైద్య శాఖ మౌలిక వసతులను, వనరులను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ ఏ శరణ్యం గా నిశ్చయించుకొని 21 రోజుల లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

మార్చ్ 24వ తేదీన విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. మర్కజ్ నిజాముద్దీన్ ఘ్తన గనుక చోటు చేసుకోకుండా ఉంది ఉంటే... ఈ లాక్ డౌన్ కాలం సరిపోయేది. కానీ ఇలా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వల్ల ఇప్పుటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ నుంచి ఇటు బెంగాల్ వరకు కేసులు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ నగరాల్లో పరిస్థితి టెన్షన్ గానే ఉంది. 

కరోనా పరిస్థితులు కొనసాగుతుండడంతో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారిని లాక్ డౌన్ ను పొడిగించమని కోరారు. మన వైద్య సదుపాయాలు అమెరికా, సింగపూర్ ల కన్నా గొప్పగా లేవని, ఆదేశాలే తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాయని అందుకోసమని ఈ లాక్ డౌన్ ని ఒక వారం లేదా రెండు వారల పాటు పొడిగించమని కోరారు. 

కేసీఆర్ కోరిందే తడువుగా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా అడిగారు. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఇదే విధంగా కోరాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారి ఒకరు స్పందిస్తూ లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటే రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా ఉండకూడదు. ఒకా కేసు ఉన్నా కూడా దాని పర్యవసానాలను తట్టుకోలేమని వ్యాఖ్యానించారు. 

నిన్న కేసీఆర్ కూడా ఇంకొన్ని రోజుల్లో దాదాపుగా తెలంగాణలో కేసులు నమోదు ఆగిపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒక్కసారి ఈ కేసుల నమోదు ఆగిపోతే ఆ తరువాత ఈ రోగులను డిశ్చార్జ్ చేసిన తరువాత ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా అనేది కేసీఆర్ ఉద్దేశం. 

ఇదే ఉద్దేశాన్ని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కేసులు నమోదవుతుండడంతో కనీసం మరొక వారంపాటయినా లాక్ డౌన్ ను పొడిగించాలని ఉద్దేశంలో ఉన్నట్టు తెలియవస్తుంది.