కరోనా ఎఫెక్ట్: పేదలకు కిలో బియ్యం రూ. 3లకే ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

పేదలకు రెండు రూపాయాలకే కిలో గోధుమలను అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
 

CCEA approves Rs.1,340-cr recapitalisation of regional rural banks to improve CRAR

న్యూఢిల్లీ:పేదలకు రెండు రూపాయాలకే కిలో గోధుమలను అందిస్తామని కేంద్రం ప్రకటించింది.

కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు నరేంద్రమోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. మంత్రివర్గ సభ్యులు సామాజిక దూరాన్ని పాటిస్తూ  సమావేశంలో మంత్రులు కూర్చొన్నారు. మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు.

ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను సదుపాయాలను అందుబాటులో ఉంచామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నట్టు కేంద్రం తేల్చి చెప్పింది. 

పేదలకు మూడు రూపాయాలకే కిలో బియ్యం, రెండు రూపాయాలకే కిలో గోధుమలు అందిస్తామన్నారు.దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ స్కీమ్ ద్వారా లబ్ది పొందే అవకాశం ఉందన్నారు మంత్రి.వచ్చే మూడు మాసాల పాటు గోధుమలు, బియ్యం నామమాత్ర ధరకే సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు.

నిత్యావసర సరుకులను నిర్ణీత సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేంద్రం ప్రకటించింది. కార్మికులకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ సరైన మార్గమని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు.కరోనాపై వదంతులు నమ్మొద్దని కేంద్ర మంత్రి చెప్పారు. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు జవదేకర్ ప్రకటించారు.

ఎకనామిక్స్ ఎఫైర్స్ కేబినెట్ కమిటి రూ.1340 కోట్లను గ్రామీణ బ్యాంకుల రీ కాపిటలైజేషన్ కోసం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు.అలీఘర్-హర్‌దుర్గంజ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.22కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఫ్లై ఓవర్ ను  ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్టు మంత్రి చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios