కరోనా క్వారంటైన్: ఉరేసుకొని వ్యాపారవేత్త ఆత్మహత్య

క్వారంటైన్ లో ఉన్న ఒక కరోనా అనుమానితుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు సంచలనం అయింది. గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

Businessman Commits suicide in Quarantine

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యానికి విలవిల్లాడిపోతోంది. భారతదేశం కూడా ఈ మహమ్మారి బారిన పది గత్యంతరం లేక లాక్ డౌన్ పరిస్థితిలోకి వెళ్ళింది. ఈ వైరస్ కి మందు లేకపోవడంతో... ఇసోలాటిన్ వార్డుల్లో పేషెంట్స్ కు చికిత్సనందిస్తూ... అనుమానితులందరిని, విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్లలో ఉంచుతున్నారు. 

ఇలా క్వారంటైన్ లో ఉన్న ఒక కరోనా అనుమానితుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు సంచలనం అయింది. గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త వినోద్ భాయ్ చౌరాసియా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ లో ఉండమని కోరారు. పరీక్షల ఫలితాల్లో కరోనా నెగటివ్ అని వచ్చినప్పటికీ... ఆయనను మాత్రం క్వారంటైన్ లోనే ఉండమన్నారు వైద్యులు. 

తాను హోమ్ క్వారంటైన్ లో ఉంటానని చెప్పడంతో అధికారులు అతని ఇంటిని పరిశీలించి అంగీకరించారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. శుక్రవారం రోజు అతడి క్వారంటైన్ ముగిసింది. అదే రోజు రాత్రి అతడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పల్లపడ్డాడు. 

రాత్రి సీలింగ్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. 

ఇప్పటికిప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు తెలియరాకున్నప్పటికీ.... లాక్ డౌన్ వల్ల వ్యాపారంలో తీవ్రంగా నష్టమొచ్చిన నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా కుటుంబ కలహాలు కూడా కారణమయి ఉండొచ్చని వారు అంటున్నారు. 

ఇకపోతే ఇటు తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో శనివారంనాడు 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 33కు చేరుకుంది. 

తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 11 మంది మరణించారు. నిజామాబాద్ లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మరణించారు. దీంతో ఆ వ్యక్తి శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. శనివారంనాడు అత్యధికంగా హైదరాబాదులోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం.

హైదరాబాదు జిల్లాలో 22 మంది, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు కరోనా వైరస్ పాజిటివ్ తో బాధపడుతున్నారు. హైదరాబాదు నారాయణగుడాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 48 మంది అతడి సన్నిహితులను, కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు. దిల్ సుఖ్ నగర్ లో ఒక్కరికి, మచ్చబొల్లారం, హఫీజ్ పేటల్లో ఇద్దరికి, మియాపూర్ లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios