కరోనాను వెళ్లగొడుత్తున్నా అంటూ బీజేపీ మహిళా నేత కాల్పులు, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలైన మంజు తివారి ప్రధాని పిలుపుకు స్పందించి ఇంటిపైన దీపాలను వెలిగించింది. ఆతరువాత తుపాకీతో ఫైరింగ్ చేసింది. 

BJP Women Leader Responds to PM Modi's call and fires into air saying she is driving away corona

నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి, దీపాలను వెలిగించాలని కోరారు. ప్రధాని పిలుపు ఇస్తే ఏ విధంగా ఉంటుందో వేరుగా చెప్పనవసరం లేదు. 

అనుకున్నట్టే యావత్ దేశమంతా ఆయన పిలుపుకు స్పందించారు. దీపాలను వెలిగించి... ప్రధాని పిలుపునిస్తే అందరం ఈ అత్యవసర సమయంలో ఆయన వెంట ఉన్నామనే విషయాన్నీ ప్రజలు స్పష్టం చేసారు. 

ఇక్కడిదాకా బాగానే ఉంది. మోడీ దీపాలను వెలిగించమని మాత్రమే చెప్పారు. కానీ కొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా దీపావళి పండగను చేసారు. టపాసులు పేల్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ టపాకాయలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 

వీరంతా కూడా ఏదో ప్రజలు తెలిసి తెలియక చేసారు అనుకోవచ్చు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే వేలం వెర్రిగా అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తే మాత్రం అది క్షమించరానిది. నిన్న ప్రధాని పిలుపును అందుకున్న ఒక బీజేపీ నాయకురాలు ఏకంగా గాల్లోకి తుపాకీతో కాల్పులు చేసి కరోనా ను వెళ్లగొడుతున్న అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేయడం సంచలనం కలిగించింది. 

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలైన మంజు తివారి ప్రధాని పిలుపుకు స్పందించి ఇంటిపైన దీపాలను వెలిగించింది. ఆతరువాత తుపాకీతో ఫైరింగ్ చేసింది. 

ఈ విషయాన్నంతా ఆమె స్వయంగా పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోసివల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తుపాకీ పట్టుకొని గాల్లోకి కాలుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. తొలుత దీపం పెట్టాను, ఇప్పుడు కరోనా ను పారద్రోలుతున్నాను అంటూ కాప్షన్ పెట్టింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios