న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని ఆరికట్టేందుకు ప్రపంచ దేశాలతో సహ భారత దేశంలో కూడా సామాజిక దూరాన్నిపాటించడంలో తీవ్ర చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ తన ట్వీట్ వైరల్ అవుతుంది.

బ్యాటరీతో నడిచే "ఈజీ బైక్"(ఈ-రిక్షా) గురించి పోస్ట్‌ చేశాడు. దాని యజమాని ఈ-రిక్షాను కస్టమైజ్ చేసి, ప్రయాణీకులు ఒకరితో ఒకరు పక్కనే కూర్చోకుండా వారికి విడివిడిగా కూర్చోడానికి సీట్లను వేరు చేశాడు. దీనిని చూసి ఆశ్చర్యపోయిన  ప్రముఖ వ్యాపావేత్త ఆనంద్ మహీంద్ర ట్విటర్ లో ఆ వీడియోని షేర్ చేశారు.
 

వీడియోలో ఇ-రిక్షాలో నాలుగు ప్రయాణీకుల కోసం నాలుగు సీట్లను వివిడిగా కూర్చోడానికి ఏర్పాటు చేశాడు. అంతేకాదు డ్రైవర్ సీటును ప్రయాణీకుల సీట్ల నుండి వేరుగా ఏర్పాటు  చేశాడు. అంటే అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్ సామాజిక దూరం పాటిస్తూ వేరు వేరుగా కూర్చోటానికి వెలుగా ఈ-రరిక్షాను ఏర్పాటు చేశాడు. 

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విటర్  ద్వారా షేర్ చేస్తూ "మా ప్రజల సామర్థ్యాలు,ఆలోచనలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండటం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి." అని ట్వీట్ కూడా చేశారు.


ఆనంద్ మహీంద్రా మహీంద్రా & మహీంద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ను ట్యాగ్ చేస్తూ ఒక కామెంట్ కూడా పెట్టాడు. "మేము అతనిని మా ఆర్ అండ్ డి & ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీంలకు సలహాదారుగా తీసుకోవాలి అంటూ ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ కి దాదాపు  1,500 రీట్వీట్లు, 7వేల మంది  లైక్ చేశారు.


కరోనావైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని స్తంభింప చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ దేశాల ప్రభుత్వాలు తమ పౌరుల భద్రత కోసం వివిధ చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా లాక్ డౌన్ కూడా అమలు పరిచాయి. ఇలాంటి సమయాల్లో, కరోనా వైరస్ సోకకుండా ప్రజలు సుర్క్షితంగా ప్రయాణించటానికి ఈ ఆటో డ్రైవర్ అధ్భూతమైన పరిష్కారం కనుగొన్నారు అని అన్నారు.