కొత్త ఫోన్‌ కొంటున్నారా ? అయితే ఈ యాప్ తప్పనిసరి...

ఈ ఆరోగ్యా సేతు యాప్ ప్రవేశపెట్టినప్పటి నుండి  దేశవ్యాప్తంగా 7.5 కోట్ల ఇన్‌స్టాల్‌లను దాటినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లోనే, ఆరోగ్య సేతు డౌన్‌లోడ్‌లు 5 కోట్ల మార్కును దాటాయి.

Aarogya Setu aap Registration Will be Mandatory to Setup in all New Phones

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా, అయితే ఇప్పుడు  కొత్త స్మార్ట్‌ఫోన్‌లను వాడే ముందు ఆరోగ్య సేతులో తమా పూర్తి వివరాలను నమోదు చేయడం తప్పనిసరి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై అధికారుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ విక్రయించడం తప్పనిసరి చేస్తోంది,

లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత, ఆరోగ్య సేతు యాప్ ముందే ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ప్రారంభించే ముందు దాన్ని సెటప్ చేయండి.

కొత్తఫోన్‌లో యాప్‌ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా రావడం మాత్రమే కాదు  ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తైన తర్వాతే ఫోన్‌ ఉపయోగించడానికి వీలవుతుంది. 

ఈ కొత్త నిర్ణయాన్ని అమలు చేయడానికి స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కేంద్రంగా ఉండే నోడల్ ఏజెన్సీలను నియమించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆరోగ్యా సేతు యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా రానుంది. ఫీచర్ ఫోన్‌లలో కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ఎనేబుల్ చెయ్యడానికి ప్రభుత్వం ఇంకా ఎటువంటి పరిష్కారాన్ని ప్రకటించలేదు.

ఈ ఆరోగ్యా సేతు యాప్ ప్రవేశపెట్టినప్పటి నుండి  దేశవ్యాప్తంగా 7.5 కోట్ల ఇన్‌స్టాల్‌లను దాటినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లోనే, ఆరోగ్య సేతు డౌన్‌లోడ్‌లు 5 కోట్ల మార్కును దాటాయి.

ఆరోగ్యా  సేతు యాప్ కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించిన ప్రభుత్వ సమాచార మార్పిడి కోసం అధికారిక సమాచార పోర్టల్‌ను కూడా అందిస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios