శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో తొలి కరోనా మరణం సంభవించింది. జమ్మూ కాశ్మీర్ లోని హైదర్ పొరా గ్రామంలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాధితో మరణించాడు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు శ్రీగనర్ నలోని ఛాతీ సంబంధ వ్యాధుల ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల క్రితం నిర్ధారించారు. 

కరోనా మరణాన్ని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు ధ్రువీకరించారు. ట్విట్టర్ లో ఆయన దానిపై స్పందించారు. మృతుడితో సన్నిహితంగా మెలిగిన నలుగురు వ్యక్తులకు కూడా కరోనా సోకినట్లు బుధవారంనాడు తేలింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల సంఖ్య 11కు చేరుకుంది. 

 

ప్రస్తుతం దేశంలో 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం 118తో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, తెలంగాణ ఆ తర్వాత వరుస స్థానాలను అక్రమించాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

మహారాష్ట్ర 128
కేరళ 118
కర్ణాటక 51
తెలంగాణ 41
గుజరాత్ 38
రాజస్థాన్ 38
రాజస్థాన్ 38
ఉత్తరప్రదేశ్ 38
ఢిల్లీ 35
హర్యానా 31
పంజాబ్ 31
తమిళనాడు 26
మధ్యప్రదేశ్ 15
లడక్ 13
జమ్మూ కాశ్మీర్ 11
ఆంధ్రప్రదేశ్ 10
పశ్చిమ బెంగాల్ 10
చండీగడ్ 7
ఉత్తరాఖండ్ 5
బీహార్ 4
చత్తీస్ గడ్ 3
గోవా 3
హిమాచల్ ప్రదేశ్ 3
ఒడిశా 2
మణిపూర్ 1
మిజోరం 1
పుదుచ్చేరి 1

కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీన వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.