దీపాలు వెలిగియ్యమంటే... ఇండ్లు తగలబెట్టుకుంటారా ఏంది? సంజయ్ రౌత్ పంచ్!
గతంలో చప్పట్లు కొట్టమని మోడీ పిలుపునిస్తే ప్రజలంతా ఒక్కకోట చేరి ర్యాలీలు తీశారు. ఈ సారి మీరు దీపాలు వెలిగించమంటే... వారి ఇండ్లను తగలబెట్టరు కదా! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉదయం ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని కోరారు.
రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు.
ఇలా మోడీ కోరిన తరువాత విపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. ఇలా సంఘీభావం తెలపడం అవసరమే అయినా వాస్తవంగా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఏమి చేస్తున్నారని మోడీ ని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మోడీ పై సెటైర్లు వేశారు. గతంలో చప్పట్లు కొట్టమని మోడీ పిలుపునిస్తే ప్రజలంతా ఒక్కకోట చేరి ర్యాలీలు తీశారు. ఈ సారి మీరు దీపాలు వెలిగించమంటే... వారి ఇండ్లను తగలబెట్టరు కదా! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శీపాలను తాము వెలిగిస్థ్యము కానీ... ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఇప్పటికే నాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా మోడీ ఆర్ధిక పచ్కగె విషయానికి ఏ విధమైన ప్-రకటన చేయకపోవడం పై తీవ్రంగా మండిపడ్డారు.
ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం 2902 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 68కి చేరుకుంది. ఇప్పటి వరకు 229 మంది కోలుకున్నారు. మొదటి రెండు వారాలతో పోలిస్తే కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గింది.
కాగా, శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 68కి చేరుకుంది.
మహరాష్ట్రలో అత్యధికంగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు.
ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి.