Asianet News TeluguAsianet News Telugu

కారు కొంటున్నారా, ఈ ఫీచర్స్ పై ఓ లుక్కే యండి.. లేదంటే....

కస్టమర్ల బడ్జెట్ బట్టి లేటెస్ట్ ఫీచర్లకు ఆకర్షితులవుతారు వెంటనే కార్లను కొనుగోలు చేస్తారు, కాని వారు కారు కొన్నాక  ఈ ఫీచర్ తమకు పెద్దగా ఉపయోగపడవని వారు భావిస్తారు. 

you should ignore this luxury car features before buying it
Author
Hyderabad, First Published Aug 13, 2020, 7:34 PM IST

ఈ రోజుల్లో కార్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాల కొత్త కొత్త లేటెస్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి. కస్టమర్ల బడ్జెట్ బట్టి లేటెస్ట్ ఫీచర్లకు ఆకర్షితులవుతారు వెంటనే కార్లను కొనుగోలు చేస్తారు,

కాని వారు కారు కొన్నాక  ఈ ఫీచర్ తమకు పెద్దగా ఉపయోగపడవని వారు భావిస్తారు. తరువాత ఈ ఫీచర్ కోసం అనవసరంగా ఇంత డబ్బు ఖర్చు చేశాన అని చింతిస్తుంటారు. కారు కొనేటప్పుడు మీరు చూసుకోవాల్సిన  కొన్ని  ఫీచర్ల గురించి తెలుసుకోండి 


 పుష్ బటన్ స్టార్ట్
ఈ రోజుల్లో చాలా కార్లలో కీలెస్ పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్ చాలా సాధారణం. కార్ కంపెనీలు ఈ ఫీచర్ ని హై లెట్ చేసి విక్రయిస్తున్నయి. ఈ ఫీచర్ బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ఫీచర్ టాప్ వేరియంట్ మోడళ్లలో మాత్రమే ఉండేధి.

ఈ ఫీచర్ కారణంగా ప్రజలు చాలా మటుకు  ఆకర్షితులవుతారు, కారును కొనుగోలు చేస్తారు, కాని ఈ ఫీచర్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే కీ లేకుండా కారును ఒక పుష్ బటన్ తో మాత్రమే కారును స్టార్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌
కార్ కంపెనీలు ఈ రోజుల్లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను లగ్జరీ ఫీచర్‌గా మార్కెట్ చేస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది కస్టమర్లు కూడా ఈ ఫీచర్ కోసం కారును కొనుగోలు చేస్తారు. కానీ మనం కాస్త పరిశీలిస్తే మీరు కారు లైట్‌ను మాన్యువల్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మరోవైపు మీరు ఈ ఫీచర్ స్టాండర్డ్‌ వేర్షన్  కారులో తీసుకుంటే మంచిది, కానీ ఈ ఫీచర్ కోసం విడిగా ఖర్చు చేసి హై వేరియంట్‌కు వెళ్లడం మంచిది కాదు. 

కార్ ఇంటీరియర్ 
ఈ రోజుల్లో లేత గోధుమరంగు ఇంటీరియర్ అన్ని కార్లలో లభిస్తుంది. కార్ కంపెనీలు ఈ ఫీచర్ హై లెట్ చేసి విక్రయిస్తాయి. లేత గోధుమరంగు లోపలి భాగం కారును డర్టి చేస్తుంది. కారు లోపలి భాగం ఇంటీరియర్ ముదురు రంగులు ఎల్లప్పుడూ మంచివి. ఎటువంటి మరకలను కనిపించకుండా ఉంటాయి. లేత గోధుమరంగు రంగు అయితే ప్రతిరోజూ వాటిని శుభ్రపరచడం చాలా కష్టం.

also read  కార్ లవర్స్ కోసం ఫోర్డ్ ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ కొత్త ఎడిషన్.. ధర ఎంతంటే ? ...

 

 ప్రాక్సీమిటి సెన్సార్ సౌండ్ అలారం
ఈ లక్షణం ఖరీదైన కార్లలో కనిపిస్తుంది. కానీ చాలా కార్ కంపెనీలు ఈ ఫీచర్‌ను ప్రీమియం బి హ్యాచ్‌బ్యాక్, సి సెగ్మెంట్ సెడాన్ కార్లలో అందించడం ప్రారంభించాయి. ఈ ఫీచర్ ఏదైనా కారు లేదా వ్యక్తి కారు దగ్గరకు వచ్చిన వెంటనే, సౌండ్ అలారం మోగడం ప్రారంభమవుతుంది.

భారతదేశంలోని రద్దీ రహదారులపై ట్రాఫిక్ పరిస్థితులు ఇప్పటికే మీకు తెలిసుంటాయి, అటువంటి పరిస్థితిలో అలారం ఎన్నిసార్లు మోగుతుందో మీరు ఊహించవచ్చు.

వాయిస్ కమాండ్ ఫీచర్‌
కార్ల కంపెనీలు ఇప్పుడు కార్లలో వాయిస్ కమాండ్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది భారతదేశా ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు. దీనికి కారణం, దాని కోడింగ్ విదేశాలలో మాట్లాడే ఇంగ్లీషు ప్రకారం పనిచేస్తుంది.

మరి భారతీయులు కొంచెం భిన్నమైన యాసను కలిగి ఉంటారు అది అర్థం చేసుకోవడం కష్టం. ఏదేమైనా ఈ ఫీచర్ కారణంగా డ్రైవింగ్ కూడా దెబ్బతింటుంది.


ఆటోమేటిక్ రెయిన్ సెన్సార్
ఇంతకుముందు ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే లభించేది, ఇప్పుడు కార్ కంపెనీలు చౌకైన సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌లకు కూడా అందిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే, కారు ఫ్రంట్ గ్లాస్ పై నీరు పడితే వెంటనే వైపర్లు స్వయంచాలకంగా ప్రారంభమవుతాయి.

ఇది చాలా బాగుంది, కాని తేలికపాటి  వర్షానికి అవసరం లేదు.  వైపర్ బ్లేడ్లు కూడా త్వరగా అయిపోతాయి. మీ అవసరాలకు అనుగుణంగా వైపర్‌ను మాన్యువల్‌గా ఆన్ చేసి ఆఫ్ చేయడం మంచిది.      

Follow Us:
Download App:
  • android
  • ios