Asianet News TeluguAsianet News Telugu

కియా: ఏటా 3 లక్షల కార్లు- ఆరు నెలలకో ఓ మోడల్​

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందని కియా మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి మనోహర్ భట్ తెలిపారు. బెంగళూరులో కియా మోటార్స్ ‘సెల్టోస్’ మోడల్ కారు ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఏటా మూడు లక్షల కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

We gets support from AP Govts, says Kia Motors Sales and Marketing dept MD Manohar Bhat
Author
Bangalore, First Published Aug 25, 2019, 12:01 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వాలు మారినా తమకు పూర్తి సహకారం అందుతోందని కియా మోటార్స్​ ఇండియా సేల్స్​, మార్కెటింగ్​ అధిపతి మనోహర్​ భట్​ తెలిపారు. బెంగళూరులో కియా సెల్టోస్​ కారును ఆవిష్కరించారు. ప్రతి ఏటా మూడు లక్షల కార్లు, ఆరు నెలలకు ఒకసారి ఒక నూతన మోడల్ కారును విపణిలోకి ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

అనంతపురంలో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు, ప్రభుత్వ సహకారంపై కియో మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి మనోహర్ భట్ మాట్లాడుతూ "భారత్​లో 1.1 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టాం.

ఏటా 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్​లో కియా వాటా 1000లో 30 వరకు ఉండే అవకాశం ఉంది. అదే చైనాలో 1000లో 100 కార్లు కియావే’ అని చెప్పారు.

‘భారత్​లో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. వాహన రంగంలో మందగమనం శాశ్వతం కాదు. కర్మాగారం ప్రారంభించడానికి రవాణా, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్ని పరిగణనలోకి తీసుకున్నాం.

అందుకే అనంతపురాన్ని ఎంపిక చేశాం. మాకు ఏ ప్రభుత్వంతోనూ ఇబ్బంది కలగలేదు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి పూర్తిగా సహకారం లభించింది’ అని కియో మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి మనోహర్ భట్ చెప్పారు.

కార్ల ఉత్పత్తి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చే విషయంలోనూ అధికారులు వేగంగా స్పందించారు. కియా ఎలక్ట్రానిక్​ వాహనాలకు అంతర్జాతీయ మార్కెట్​ ఉంది.

ఒకసారి ఛార్జ్​ చేస్తే 450 కిలోమీటర్లు నడిచే కార్లు అమెరికా, కొరియా మార్కెట్లలో లభిస్తున్నాయి’ అని కియో మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి  మనోహర్ భట్ తెలిపారు.

‘దేశంలో డిమాండ్​ ఉండి, అందుకు ప్రభుత్వ సహకారం లభిస్తే అనంతపురంలోనే వాటిని తయారు చేస్తాం. ప్రతి ఆరు నెలలకు కొత్త మోడల్​ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఇక్కడి కర్మాగారం నుంచి తొలుత దేశీయ అవసరాలకే ఉత్పత్తి చేస్తున్నాం’ అని మనోహర్ భట్ తెలిపారు. తర్వాత అవకాశం ఉంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios