మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..
పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ భారతదేశంలో కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ ప్రారంభించింది. ఆల్-న్యూ ఐ20 మోడల్ కోసం కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.
కొత్త జనరేషన్ ఐ20 ఫ్రంట్ ఎండ్ వెర్నా తరువాత రూపొందిచారు. హ్యుందాయ్ ఐ20 కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఫోర్డ్ ఫియస్టా, ఆడి ఎ1కు కొత్త జనరేషన్ ఐ20 సమానంగా ఉంటుంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్‌ఎస్ మాట్లాడూతూ భారత్‌లో ప్రీమియం హాచ్‌బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్‌లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్-న్యూ ఐ20 నవంబర్ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.
హ్యుందాయ్ ఐ20 లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, కొత్త జనరేషన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ధర భారతదేశంలో 6 నుండి 10 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుంది. సరికొత్త హ్యుందాయ్ ఐ20 కార్ మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా, హోండా జాజ్ లతో పోటీ పడనుంది.