ఉబెర్ కార్యలయం మూసివేత.. ఖర్చులు తగ్గించుకోవడానికే...

దేశంలోని ప్రముఖ క్యాబ్ సర్వీస్, రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబెర్  ఖర్చులను తగ్గించుకోవడానికి ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయాలని అమెరికాకు చెందిన సంస్థ నిర్ణయించింది. 

Uber office shuts down in Mumbai to cut costs says ceo

ప్రపంచవ్యాప్తతంగా కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా  రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి  కూరుకుపోయింది. దేశంలోని ప్రముఖ క్యాబ్ సర్వీస్, రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబెర్  ఖర్చులను తగ్గించుకోవడానికి ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయాలని అమెరికాకు చెందిన సంస్థ నిర్ణయించింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉబెర్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఒక నివేదిక ప్రకారం, ముంబైలోని ఉబెర్ కంపెనీ సేవలు ఎప్పటిలాగే అందరికీ అందిస్తూనే ఉంటుంది.

ముంబైలోని తన కార్యాలయా మూసివేత వల్ల ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఉబెర్ కార్యకలాపాలు అన్ని రిమోట్ గా కొనసాగించనుంది. ముంబైలోని ఉబెర్‌  ఉద్యోగులు ఇంటి నుండి డిసెంబర్ వరకు పనిచేయనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఉబెర్ ప్రతినిధి నిరాకరించారు.

also read పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్ ...

ఇటీవల ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి కేంద్రీకరిస్తారని ఆహారం, కిరాణా సామాగ్రిని డెలివరీ పై రీఫోకస్‌ చేస్తానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 6,700 మంది ఉద్యోగులను, దేశీయంగా 600 మందిని తొలగించిన దాదాపు నెల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

కస్టమర్, డ్రైవర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్, లీగల్, ఫైనాన్స్, పాలసీ, మార్కెటింగ్ సహా వివిధ విభాగాలలోని 600 మంది ఉద్యోగులను భారతదేశంలో తొలగించారు. కోవిడ్ -19 ప్రభావం వ్యాపారాలపై పడినప్పటి నుండి ఇది సంస్థ యొక్క మూడవ అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు.

కరోనావైరస్  లాక్ డౌన్ వల్ల ఆదాయం పడిపోవడంతో ఉబెర్  ప్రత్యర్థి అయిన ఓలా మేలో దాదాపు 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (క్యూ 1 2020) మొదటి త్రైమాసికంలో ఉబెర్ నికర నష్టం గత ఏడాదిలో నమోదైన 1.1 బిలియన్ డాలర్ల నష్టం నుండి 2.9 బిలియన్ డాలర్లకు పెరిగింది, అంటే 163 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం సంవత్సరానికి 14 శాతం పెరిగి 3.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios