ప్లాంట్ల పున:ప్రారంభంతో దూసుకెళ్లిన టాటా మోటర్స్‌ షేర్లు..

ప్రపంచ వ్యాప్తంగా టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థల ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు పున: ప్రారంభం అయ్యాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. దీంత దాని షేర్ జూమ్మంటూ దూసుకెళ్లింది. 
 

Trending stocks: Tata Motors shares gain nearly 3%

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ నిబంధనలు సడలించాక టాటా కంపెనీ అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఈ వార్తలు వెల్లడి కావడంతో టాటామోటర్స్‌ షేర్ మంగళవారం 7.70శాతం లాభంతో ముగిసింది.

కేంద్రం నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జార్ఖండ్ రాష్ట్రంలోని జంషేడ్‌పూర్‌ ప్లాంట్‌తో సహా దేశవ్యాప్తంగా అ‍న్ని ప్లాంట్లలో 2020 మే 27వ తేదీ నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

క్రమంగా డిమాండ్‌ పుంజుకుంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. అయితే సరఫరా విభాగం నుంచి కమర్షియల్‌ వాహన విభాగంలో 90శాతం సప్లయర్లు అనుమతులు పొందారు. 80శాతం కార్యకలాపాలు ప్రారంభించారు. మొత్తం డిమాండ్‌కు కేవలం 60శాతం డీలర్లు తక్షణ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

also read మహీంద్రా వాహనాల సేల్స్ తగ్గిన..ఆ కార్ల డిమాండ్ తగ్గలేదు..

లాక్‌డౌన్ సడలింపు తర్వాత చైనాలో వాహన అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రజలు షోరూమ్‌లకు తిరిగి వస్తుండటంతో ఆ దేశంలోని చాంగ్షు లోని కంపెనీ జాయింట్-వెంచర్ ప్లాంట్ మార్చి నుండి పని చేస్తోంది. అలాగే బ్రిటన్‌లో సోలిహుల్ ఇంజిన్ ప్లాంట్లు, స్లోవేకియా ప్లాంట్, ఆస్ట్రియాలోని కాంట్రాక్ట్ అసెంబ్లీ లైన్లలో క్రమంగా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. 

ప్లాంట్ల పునఃప్రారంభ వార్తలతో షేరు మార్కెట్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో షేరు 8.50శాతానికి పైగా లాభపడి రూ.97.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 7.70శాతం లాభంతో రూ.96.50 వద్ద స్థిరపడింది.

కియా మోటార్స్ సరికొత్త సెల్టోస్ ఆవిష్కరణ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా అధునాతన సౌకర్యాలతో  విపణిలోకి నూతన కారును  ప్రవేశ పెట్టింది. సెల్టోస్‌ను రూ .9.89 లక్షల ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. 

భారతదేశంలో కియా నుంచి వచ్చిన తొలి కారు అద్భుతమైన విజయం అందుకున్నది. ఆ తరువాత, భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్- ఎస్‌యూవీ మోడల్ కారుగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి, కంపెనీ సెల్టోస్‌ను సరికొత్త ఫీచర్లతో  రూపొందించింది. 10 వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios