టయోటా అర్బన్ క్రూయిజర్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 11వేలు చెల్లిస్తే చాలు..

పండుగ సీజన్లో విడుదల కానున్న ఈ ఎస్‌యూవీ భారతదేశంలో సుజుకి-టయోటా భాగస్వామ్యం నుండి రెండవ ఉత్పత్తి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించడమే కాకుండా జపాన్ కార్ల తయారీ సంస్థ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. 

Toyota Urban Cruiser Pre-Bookings Begin In India through online

ప్రముఖ కార్ల తయారీదారి టొయోటా మోటార్స్ కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. మొత్తం 11వేలు ఆన్ లైన్ ద్వారా చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు.

పండుగ సీజన్లో విడుదల కానున్న ఈ ఎస్‌యూవీ భారతదేశంలో సుజుకి-టయోటా భాగస్వామ్యం నుండి రెండవ ఉత్పత్తి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించడమే కాకుండా జపాన్ కార్ల తయారీ సంస్థ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇండియాలో లాంచ్‌కు ముందే ఎస్‌యూవీ ఫీచర్స్, లక్షణాలు, కలర్ ఆప్షన్స్, వివరాలను తెలిపింది.

రాబోయే టయోటా అర్బన్ క్రూయిజర్ తప్పనిసరిగా మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ రీ-బ్యాడ్జ్ వెర్షన్ అవుతుంది. టు-స్లాట్ వెడ్జ్ కట్ గ్రిల్, ట్రాపెజాయిడల్ బోల్డ్ ఫాగ్ ఏరియా, డ్యూయల్ ఫంక్షన్ ఉన్న డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్-కమ్-ఇండికేటర్, ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్టైలిష్ స్ప్లిట్ ఎల్‌ఈడీ టైల్‌ల్యాంప్‌లు, హై మౌంటెడ్ ఎల్‌ఈడీ స్టాప్ లాంప్ ఇంకా మరిన్నో ఫీచర్స్ ఉన్నాయి.

also read వాహన ఇన్సూరన్స్ రినివల్ చేస్తున్నారా అయితే జాగ్రత.. లేదంటే జరిమానే.. ...

సింగిల్ టోన్, డ్యూయల్-టోన్ షేడ్స్  బ్లూ, బ్రౌన్, వైట్, ఆరెంజ్, సిల్వర్, గ్రే, బ్లూ / బ్లాక్, బ్రౌన్ / బ్లాక్, ఆరెంజ్ / వైట్ వంటి కలర్ ఆప్షన్స్ లో ఎస్‌యూవీ అందించబడుతుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ క్యాబిన్ ప్రధానంగా విటారా బ్రెజ్జాతో సమానంగా ఉంటుంది.

డ్యూయల్-టోన్ డార్క్ బ్రౌన్ ప్రీమియం ఇంటీరియర్స్ ద్వారా అండర్లైన్ చేసింది. స్మార్ట్ ఫోన్ ఆధారిత నావిగేషన్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే అనుకూలతతో స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందింది.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలెక్ట్రో క్రోమిక్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్ (ఐఆర్‌విఎం)తో ఇంకా చాలా ఫీచర్స్ ఈ ఎస్‌యూవీలో అందించనున్నారు.

5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేశారు. ముఖ్యంగా మాన్యువల్ వేరియంట్లు పెట్రోల్ ఆప్షన్స్ తో అందిస్తున్నారు, అయితే ఆటోమేటిక్ వెర్షన్లు టార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐడిల్ స్టార్ట్ వంటి ఫంక్షన్లతో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌తో అధునాతన లి-అయాన్ బ్యాటరీతో తేలికపాటి-హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios