జపాన్ కు చెందిన టొయోటా మోటార్ కార్పొరేషన్ దేశంలో అధిక పన్నుల విధానం కారణంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక పై భారతదేశంలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, మార్కెట్లో మాత్రం ప్రస్తుతం కొనసాగుతామని టయోటా తెలిపింది.

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షిభాన్ని అధిగమించడానికి ప్రపంచ సంస్థలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఒక విధంగా చెదు అనుభవం అనే చెప్పాలి.

కార్లు, మోటారుబైకులపై ప్రభుత్వం పన్నులు చాలా అధికం కావడం,  తద్వారా కంపెనీలు స్కేల్ నిర్మించడం కష్టమని టయోటా స్థానిక యూనిట్ టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేకర్ విశ్వనాథన్ అన్నారు.

చాలా మంది వినియోగదారులకు అందుబాటులో లేని కార్లను కలిగి ఉండటం, ఉత్పత్తి కర్మాగారాలలో పనులు లేక పోవటం వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టిండానికి  ఆస్కారం ఉండదు అని చెప్పాడు.

also read ఇండియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. గంటకు 95కి.మీ స్పీడ్.. ...

ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటైన టయోటా 1997లో భారతదేశంలో ప్రారంభించింది. దీని స్థానిక యూనిట్ జపనీస్ కంపెనీతో 89% యాజమాన్యంలో ఉంది.  

భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలు 28% అధిక పన్నులను ఆకర్షిస్తున్నయి. 1500 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన నాలుగు మీటర్ల పొడవైన ఎస్‌యూవీపై పన్ను 50% వరకు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. 

అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్  గా కొనసాగుతోంది.  

హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. తాజాగా ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను కూడా ప్రారంభమయ్యాయి.