సిటీ రైడ్స్ కోసం టయోటా అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్ పై 150 కి.మీ. నాన్ స్టాప్..

 ఈ ఎలక్ట్రిక్ వెహికల్  పేరు సి+పాడ్ అని కంపెనీ పేర్కొంది. టయోటా సంస్థ సి+పాడ్ పరిమిత మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే పాదచారులను రక్షించడానికి ప్రత్యేకమైన  ఫీచర్స్ దీనిలో అందించారు.

Toyota motors C+Pod Minuscule EV Unveiled In Japan

 టయోటా మోటార్ కార్పొరేషన్ అతిచిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్  పేరు సి+పాడ్ అని కంపెనీ పేర్కొంది. టయోటా సంస్థ సి+పాడ్ పరిమిత మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది.

ప్రత్యేకమైన విషయం ఏంటంటే పాదచారులను రక్షించడానికి ప్రత్యేకమైన  ఫీచర్స్ దీనిలో అందించారు. రేవా లేదా మహీంద్రా ఇ20 వంటి చిన్న పరిమాణంలో ఉన్న ఈ అల్ట్రా-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం చిన్న ఇంట్రా-సిటీ రాకపోకలకు అనుగుణంగా ఉంటుంది.

భారతదేశంలో వాహన తయారీదారులకు గత ఏడాదినే క్వాడ్రాసైకిల్ వాహనాలను విక్రయించడానికి అనుమతి లభించింది. అయితే ఈ మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందలేదు. 

సి+పాడ్ కారులో  9.06 kWh లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. దీని ఇంజన్ గరిష్ట శక్తిని 12 హెచ్‌పి, పీక్ టార్క్ 56 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. టయోటా ప్రకారం సి + పాడ్ ఒక ఫుల్ చార్జ్ పై 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

also read హోండా మోటర్స్ అరుదైన ఘనత.. రెండు దశాబ్దాల్లో 25 లక్షల యూనిట్ల అమ్మకాలు.. ...

అంటే, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఆపకుండా 150 కిలోమీటర్లు నడుస్తుంది. 200V / 16A విద్యుత్ సప్లయి సహాయంతో ఈ కారును కేవలం 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అలాగే  100V / 6A స్టాండర్డ్ విద్యుత్ సప్లయి సహాయంతో ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి 16 గంటలు పడుతుంది.

 దీని టాప్-స్పీడ్ 60 కి.మీ. టయోటా సి+పాడ్ పొడవు 2,490 మిల్లీమీటర్లు, వెడల్పు 1,290 మిల్లీమీటర్లు, ఎత్తు 1,550 మిల్లీమీటర్లు. దీని అద్భుతమైన పరిమాణం అత్యంత ప్రత్యేకమైన కారుగా నిలుస్తుంది. దీని టర్నింగ్ వ్యాసార్థం 3.9 మీటర్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో టర్న్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. 

టయోటా తన సి+పాడ్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. దీని ఎక్స్ ట్రిమ్ బరువు 670 కిలోలు. అలాగే జి ట్రిమ్ బరువు 690 కిలోలు. ఎక్స్ వేరియంట్ ధర 1.65 మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 11.75 లక్షల రూపాయలు. ఇంకా  జి వేరియంట్ ధర 1.71 మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.12.15 లక్షలు.

 ఈ కారు చిన్న నగరాల్లో, సిటీలో నివసించే ప్రజలకు చక్కటి ఆప్షన్ గా ఉంటుంది.
Toyota motors C+Pod Minuscule EV Unveiled In Japan

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios