పడిపోయిన టయోటా కిర్లోస్కర్ మోటార్ విక్రయాలు.. ఆగస్టులో 50% సేల్స్ డౌన్..
గత ఏడాది 2019 ఆగస్టులో కంపెనీ మొత్తం 10,701 యూనిట్లను విక్రయించింది. అయితే జూలై నెలతో పోలిస్తే ఆగష్టులో కంపెనీ విక్రయాలు 3 శాతం పెరిగింది.
జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) కార్పొరేషన్ 2020 ఆగస్టులో దేశంలో మొత్తం విక్రయలు 50% తగ్గుదలతో 5555 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. గత ఏడాది 2019 ఆగస్టులో కంపెనీ మొత్తం 10,701 యూనిట్లను విక్రయించింది.
అయితే జూలై నెలతో పోలిస్తే ఆగష్టులో కంపెనీ విక్రయాలు 3 శాతం పెరిగింది. జూలైలో విక్రయించిన మొత్తం యూనిట్లు 5,386. టికెఎం సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున డీలర్లకు వాహనాల పంపిణీ, విక్రయాలు సవాలుగా ఉందని ఆయన అన్నారు.
సంస్థలోని ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్య భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా వ్యాప్తి డిమాండ్, సరఫరా రెండింటిపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ తరువాత కస్టమర్ల నుండి మా మోడళ్లలో చాలా వరకు డిమాండ్ పెరిగింది.
also read అద్భుతమైన ఫీచర్లతో టయోటా కొత్త వెర్షన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విడుదల.. ...
బెంగుళూరు, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా డీలర్లకు వాహనాలను సరఫరా చేయడం సవాలుగా ఉంది, ఎందుకంటే ఇక్కడే మా ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. మా ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఉత్పత్తిని కూడా ఒకే షిఫ్ట్‌కు తగ్గించడానికి కూడా ఇది దారితీసింది.
టికెఎమ్ లో సగానికి పైగా కోవిడ్-19 సోకిన ఉద్యోగులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు నిర్దేశించిన విధంగా అవసరమైన అన్ని ప్రోటోకాల్లను పూర్తి చేసిన తరువాత తిరిగి పనిలో చేరారు. మా కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్లను తీర్చగలిగేలా సరఫరాను పెంచడంలో ఇది మాకు ఎంతో సహాయపడింది అని ఆయన అన్నారు.
సంస్థ తన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకు చెందిన అర్బన్ క్రూయిజర్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది, దీని కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.