Renault Kwid: రూ. 5 లక్షల లోపు తక్కువ ధరకే కారు కొనే అవకాశం..ఈ మోడల్ పై ఏకంగా రూ.82 వేల డిస్కౌంట్..
మీ బడ్జెట్ 5 లక్షల రూపాయలు అయితే, కొత్త కారు కొనాలని ఆలోచిస్తే మాత్రం, రెనాల్ట్ కంపెనీ నుంచి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ మోడల్ కారుపై మంచి డిస్కౌంట్ లను పొందే వీలుంది. ఈ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది.
Renault Kwid: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా, అయితే రెనాల్ట్ ఇండియా తమ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. గత జనవరిలోనే వివిధ మోడళ్లపై కస్టమర్లు ఏకంగా రూ.1.30 లక్షల వరకు తగ్గింపుతో కార్లను కొనుగోలు చేశారు. రెనాల్ట్ ప్రస్తుతం భారతదేశంలో ఈ కంపెనీ నాలుగు మోడళ్లని విక్రయిస్తుంది. క్విడ్, ట్రైబర్, కిగర్, డస్టర్. రెనాల్ట్ తన క్విడ్ మోడల్ కారుపై ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్లు, డీల్‌లను అందిస్తోంది.
ఒక వేళ మీ బడ్జెట్ 5 లక్షల రూపాయలు అయితే, కొత్త కారు కొనాలని ఆలోచిస్తే మాత్రం, రెనాల్ట్ కంపెనీ నుంచి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ మోడల్ కారుపై మంచి డిస్కౌంట్ లను పొందే వీలుంది. ఈ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది.
ఈ ఆఫర్ కింద రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ప్రస్తుతం రూ. 82 వేల వరకు డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ లో భాగంగా రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ చేంజ్ బెనిఫిట్, అలాగే రూ. 10,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇది కాకుండా, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 37000 వరకు లాయల్టీ బెనిఫిట్స్ , రూ. 10 వేల అదనపు ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్ రెండు వేరియంట్స్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. క్విడ్ 1.0 RXL AMT వేరియంట్‌లో, కంపెనీ 999 cc ఇంజిన్‌తో, 91 Nm టార్క్, 67 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫ్రంట్ పవర్ విండోస్, ఎయిర్ కండీషనర్, సింగిల్ డిఐఎన్ మ్యూజిక్ సిస్టమ్, యుఎస్‌బి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు కారులో అందుబాటులో ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్ 22 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారు ధరలు రూ. 4.24 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 5.70 లక్షల వరకు అందుబాటులో ఉంది. దీని ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ మోడల్ కోసం రూ. 5.54 లక్షల వరకూ ఖరీదు చేయాల్సి ఉంటుంది. ఈ కారులో డ్యుయల్ టోన్ ఎక్ట్సీరియర్‌లో ఎలక్ట్రిక్ ORVM, వైట్ కలర్‌లో డే అండ్ నైట్ IRVM, క్లైంబర్ ఎడిషన్ బ్లాక్ రూఫ్ వంటి కొత్త ఫీచర్లను కంపెనీ అందించింది. ఇది కాకుండా ఫ్రంట్ డ్రైవర్ సైడ్ పైరోటెక్, ప్రిటెన్షనర్‌ను కూడా పొందవచ్చు.