Asianet News TeluguAsianet News Telugu

మార్చి 21న మార్కెట్లోకి సరికొత్త హ్యుందాయ్ వెర్నా కారు విడుదలకు సిద్ధం, ధర, ఫీచర్లు ఇవే..

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా మార్చి 21న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ కొత్త సెడాన్ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీరు కూడా మీ సమీప హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

The new Hyundai Verna will be launched in the market on March 21 MKA
Author
First Published Feb 19, 2023, 1:25 AM IST

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే హ్యుందాయ్ నుంచి వెర్నా కొత్త వెర్షన్ వచ్చే నెల మార్చి 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో వెర్నా పాత వర్షన్ చక్కటి సేల్స్ సాధించింది. అయితే ఈ సెడాన్ మోడల్ కారు ప్రస్తుతం అప్డేటెడ్ వర్షన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కారుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ధర ఫీచర్లను తెలుసుకుందాం.

దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్ కోసం నెక్ట్స్ జనరేషన్ వెర్నాపై పని చేస్తోంది. ఇప్పుడు, 2023 వెర్నాను మార్చి 21న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త సెడాన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.హ్యుందాయ్ అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ కారును మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కారును బుక్ చేసుకోవాలంటే రూ.25,000 టోకెన్ మొత్తం చెల్లించాలి. 

ఈ కారులో 1.0 లీటర్ టర్బో-జిడిఐ ఇంజన్ స్థానంలో కొత్త 1.5 టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజన్ రానుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంది. ప్రపంచ మార్కెట్ కోసం, ఈ ఇంజన్ 158 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక వెర్నా అనేక వేరియంట్లలో అందించనున్నారు. 

ప్రస్తుతం అనేక హ్యుందాయ్ వాహనాల్లో అందుబాటులో ఉన్న 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్‌ను హ్యుందాయ్ ఈ మోడల్ లో రిపీట్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఇది 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా IVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటోంది. 

2023 వెర్నా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. EX, S, SX, SX(O) ఉంటాయి. 2023 వెర్నా ఏడు మోనోటోన్, రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ లతో మార్కెట్లోకి వస్తోంది, ఇందులో 3 కొత్త మోనోటోన్ రంగులు అబిస్ బ్లాక్ , అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ ఉన్నాయి.

హ్యుందాయ్  మోటార్స్ నుంచి ఇప్పటికే పలు కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే మీరు సెడాన్ కారు కొనాలని చూస్తున్నట్లయితే వెర్నా ఒక చక్కటి ఆప్షన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ మోడల్ కి చెందినటువంటి కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అంతేకాదు ధర పరంగా చూసినప్పటికీ సెడాన్ కార్లలో వెర్నా అందరికీ అందుబాటులో ఉన్న మోడల్ అనే చెప్పాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios