Asianet News TeluguAsianet News Telugu

బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త మోడల్ కార్లు లాంచ్ !

మెర్సిడెస్ బెంజ్ కారు అనేక ఫీచర్లతో సహా అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నకారులో ఒకటి. ఎందుకంటే ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అసాధారణమైన పనితీరు కనబరుస్తుంది. 

the all-new Mercedes-Benz GLE LWB and GLS  launched
Author
Hyderabad, First Published Jul 10, 2020, 6:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగళూరు : ప్రతి ఒక్కరికీ వారి ఇంటి ముందు మెర్సిడెస్ బెంజ్ కారు ఉండాలని, అందులో ప్రయాణించాలనే కల ఎవరికీ ఉండదు చెప్పండి. లగ్జరీ, వైభవం, ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ టెక్నాలజికి  పెట్టింది పేరుగా మెర్సిడెస్ బెంజ్ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రెండు సరికొత్త కార్లను విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఎల్‌డబ్ల్యుబి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ కార్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. కారు కొనాలనే ఆలోచినలో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ ముందుంటుంది. ఈ బ్రాండ్ గుర్తింపు అలా మిగిలిపోతుంది అంటే నమ్మండి.

మెర్సిడెస్ బెంజ్ గత కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో ప్రముఖ లగ్జరీ కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రతి బెంజ్ కారు అసాధారణమైన పనితీరును కలిగి ఉంటుంది. దీని ప్రతి కారు హార్స్‌ పవర్, టార్క్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లకు ప్రీమియం అప్హోల్స్టరీ, ఖరీదైన కార్పెట్, పాలిష్ వుడ్ ట్రిమ్, ఎంటర్టైన్మెంట్  ఫీచర్లతో పూర్తి డ్రైవింగ్ అనుభవం కోసం తయారు చేయబడింది. మెర్సిడెస్ బెంజ్ అదే వారసత్వం, కస్టమర్ విశ్వాసం, నమ్మకాన్ని నిలుపుకుంది. 

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఎల్‌డబ్ల్యుబి కారు అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన పనితీరుతో మీ మనస్సును దోచేస్తుంది. ఇది కొత్త యువతరానికి సౌకర్యవంతమైన, స్టైలిష్ 5-సీట్ల ఎస్‌యూవీ. ఈ కారు మెరుగైన బ్యాక్ సీటు సౌకర్యం కోసం లాంగ్ వీల్-బేస్, అల్లాయ్ వీల్స్, ఆఫ్-రోడ్ ఎబిఎస్‌తో పాటు మల్టీ ఫంక్షనింగ్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది.  కారులో ఎక్కువ వీల్‌బేస్ ఉన్నందున వెనుక సీట్లో ప్రయాణించడం కూడా సౌకర్యంగా ఉంటుంది. 

 

 

అల్-న్యూ జిఎల్ ఎల్‌డబ్ల్యుబి కారులో సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్‌లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఎడిఎస్ +తో ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్, ఆల్-న్యూ స్ట్రైకింగ్ ఇంటీరియర్స్, ఎన్‌టిజి 6 ఎమ్‌బియుఎక్స్ విత్ నేచురల్ వాయిస్ అసిస్ట్, ఆల్-న్యూ మెర్సిడెస్ మి యాప్ ఫీచర్లు ఇతరులకి అసూయపడేలా చేస్తుంది. దీని అందమైన పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్‌ను మనల్ని మరచిపోనివ్వదు.

ఆల్-న్యూ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్యువిలలో  ఎస్-క్లాస్ కారు ఇది. ఇది 7 సీట్ల ఎస్‌యూవీ, ఇక్యూ బూస్ట్ టెక్నాలజీతో దీనీలో ఉంది. డ్రైవర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్ స్పోర్ట్స్ మల్టీ బీమ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ ప్లస్ రాత్రిపూట డ్రైవింగ్‌ను మనోహరంగా చేస్తుంది. ఈ కారు కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, రెండు వైపులా రబ్బరు స్టుడ్‌లతో శైనింగ్ రన్నింగ్ బోర్డ్‌ను కలిగి ఉంది. 

the all-new Mercedes-Benz GLE LWB and GLS  launched

కారు లోపలి భాగంలో కూడా ఎలాంటి రాజీపడలేదు, ఇందులో బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌,  వెనుక భాగంలో వైర్‌లెస్ ఛార్జింగ్, ఇంకా కారు అంతటా మొత్తం 11 యుఎస్‌బి పోర్ట్‌లు ఉంటాయి. కారు 2 వ, 3 వ వరుసలలో వన్-టచ్ సీట్ ఈజీ ఫోల్డ్ ఫీచర్ ఉంది. ఇది లాంగ్ డ్రైవ్‌లకు సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ఈ కారులో భద్రత మరొక బెస్ట్  ఫీచర్ ఏంటంటే ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ఆఫ్-రోడ్ ఎబిఎస్, ఏ‌డి‌ఎస్ +తో ఎయిర్ మాటిక్ సస్పెన్షన్‌లను కలిగి ఉంది.

21 అంగుళాల అల్లాయ్ విల్స్, ఇరువైపులా రబ్బరు స్టడ్ ఉన్నందున ఈ ఎస్‌యూవీ ఏ రహదారిలోనైనా స్మూత్ గా వెళ్తుంది. కారు లోపలి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్రూస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ముందు, వెనుక భాగంలో వైర్‌లెస్ ఛార్జింగ్, ఈ కారులో 11 యుఎస్‌బి పోర్ట్ ఏర్పాటులు చేశారు . 2వ, 3వ వరుస సీట్ల కోసం సీట్ ఈజీ ఫోల్డ్ ఫీచర్ ఉంది. ఇది లాంగ్ డ్రైవ్‌లో ప్రయాణించడం సులభం చేస్తుంది.

 

భద్రతకు ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ఆఫ్-రోడ్ ఎబిఎస్, ఏ‌డి‌ఎస్ +తో ఎయిర్ మాటిక్ సస్పెన్షన్‌లను కలిగి ఉంది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారులో యాక్టివ్ పార్క్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, 2 ఎక్స్ 31.2 సెం.మీ (12.3) వైడ్ స్క్రీన్ కాక్‌పిక్, వాయిస్ అసిస్ట్, హెచ్‌డిడి నావిగేషన్, మెర్సిడెస్ బెంజ్ మి యాప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


మెర్సిడెస్ బెంజ్ దాని ఎస్‌యూవీ కార్ల మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి దూకుడుగా పనిచేస్తోంది. 2019లో 7,83,000 కన్నా ఎక్కువ కార్లును సేల్స్ చేసింది. ఎస్‌యూవీ విభాగంలో అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ విభాగం డిమాండ్, అమ్మకాల పరంగా విజయవంతమైంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ వినియోగదారుల కోసం ఐదు కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. ఈ కార్లు జి350డి, సరికొత్త జిఎల్‌సి, లాంగ్ వీల్‌బేస్ జిఎల్‌ఇ, కొత్త జిఎల్‌సి కూపే, జిఎల్‌ఎస్.

లగ్జరీ, లగ్జరీ ప్రయాణాలకు భారతీయుల మొదటి ఎంపికగా మెర్సిడెస్ బెంజ్ నిరూపించబడింది.కొత్త మెర్సిడెస్ జి‌ఎల్‌ఈ ఎల్‌డబల్యూ‌బి, జి‌ఎల్‌ఎస్ లో పెద్ద మార్పు లేదు. జిఎల్‌ఇ ఎల్‌డబ్ల్యుబి 5 సీట్ల ఎస్‌యూవీ కాగా, జిఎల్‌ఎస్ 7 సీట్ల ఎస్‌యూవీ. నాణ్యత, డిజైన్, టెక్నాలజీ, ఆధునికత, లగ్జరీ, సామర్థ్యం లగ్జరీ కారుకు మెర్సిడెస్ జిఎల్‌డబ్ల్యుబి & జిఎల్‌ఎస్ ఉత్తమమైన ఎంపిక.

Follow Us:
Download App:
  • android
  • ios