Asianet News TeluguAsianet News Telugu

టెస్లా ఇక నంబర్ వన్.. ఎలన్ మస్క్ దూకుడుకు టోయోటా ఔట్

విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ సంస్థగా నిలిచింది. ఇంతకుముందు టయోటా కిర్లోస్కర్ నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. 2019 మూడో త్రైమాసికం నుంచి వరుస లాభాలు గడించడంతో టెస్లా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. తత్ఫలితంగా ప్రపంచంలోకెల్లా అత్యధిక లాభాలు గడిస్తున్న టయోటా సంస్థను దాటేసింది టెస్లా.

Tesla overtakes Toyota to become most valuable carmaker in the world
Author
Hyderabad, First Published Jul 3, 2020, 10:14 AM IST

న్యూయార్క్: విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఈ పేరు ప్రస్తుతం ఓ సంచలనం. నాసాతో కలిసి అంతరిక్షంలోకి మానవసహిత రాకెట్ పంపిన ఏకైక ప్రైవేట్ సంస్థగా ఎలన్ మస్క్‌ సారథ్యంలో పని చేస్తున్న స్పేస్ ఎక్స్ నిలిచింది.

ఈ నేపథ్యంలో అతడి మిగతా కంపెనీలు కూడా మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా మస్క్‌ ప్రధాన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ప్రపంచంలోనే నెంబర్ వన్‌ స్థానానికి చేరుకుంది. టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా ప్రస్తుతం 208 బిలియన్ డాలర్లకు చేరింది.

దీంతో సంస్థ షేర్ స్టాక్ మార్కెట్లలో 5 శాతం పెరిగి 1,333 డాలర్లకు చేరుకున్నది. దీంతో గురువారం మార్కెట్ క్యాపిటలైజేసన్ 209.47 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. టయోటా కార్ల తయారీ సంస్థ మార్కెట్ క్యాపిటజేషన్ కంటే దాదాపుగా 6 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

ఇప్పటివరకు 203 బిలియన్ డాలర్లతో టోయోటా కార్ల తయారీ సంస్థ ముందు ఉన్నప్పటికీ దానిని వెనక్కు నెట్టి మరీ టెస్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనిపై ఎలన్ మస్క్ తన ఉద్యోగులకు ఓ ఈమెయిల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

also readపోర్స్చే ఇండియా డైరెక్టర్‌ పదవికి పవన్‌ శెట్టి గుడ్ బై..వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. ...

‘కంపెనీ గడ్డుకాలంలో ఉన్నప్పటికీ మీరు పనిచేసిన తీరు అద్భుతం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. మీతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టెస్లా ప్రారంభం నుంచి ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ లాభాలు గడించింది లేదు. ఇలాంటి సందర్భంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి సంస్థ చేరడం గమనార్హం.

అమెరికాలోని జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రెట్లకు పైగా ఉంటుంది. 2020 ప్రారంభం నుంచి టెస్లా కార్ల కంపెనీ షేర్ 163 శాతానికి పైగా దూసుకెళ్లింది. కొన్నేళ్లుగా నష్టాలను భరిస్తున్న టెస్లా 2019 మూడో త్రైమాసికం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా వరుసగా లాభాల్లో పయనించడం ఇన్వస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించింది. 

ప్రపంచంలోకెల్లా అత్యంత లాభదాయక ఆటోమొబైల్స్ సంస్థల్లో ఒక్కటిగా నిలిచిన టయోటా 2019 ఆర్థిక సంవత్సరంలో 10.46 మిలియన్ల కార్లను విక్రయించింది. ఈ సంస్థ నికర ఆదాయం 30,226 బిలియన్ల యెన్లు అంటే 281.20 బిలియన్ డాలర్లు. 

గత ఆర్థిక సంవత్సరంలో టెస్లా 24.6 బిలియన్ల ఆదాయం కలిగి ఉంది. 3,67,200 వాహనాలను వినియోగదారులకు డెలివరీ చేసింది. 2020లో 5 లక్షల వాహనాలను డెలివరీ చేస్తుందని ఎలన్ మన్క్ ఇంతకుముందు ప్రకటించారు. కరోనా సంక్షోభం వేళ కూడా సంస్థ తన లక్ష్యాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios