టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీపై గతకొంతకాలంగా చర్చనీయాంశమైంది. అమెరికన్ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సిఈఓ ఎలోన్ మస్క్ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో భారతదేశంలో కార్ల అమ్మకాలను ప్రారంభించనుంది. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీపై గతకొంతకాలంగా చర్చనీయాంశమైంది. అమెరికన్ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సిఈఓ ఎలోన్ మస్క్ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు తెలిపారు.
మీడియా నివేదికల ప్రకారం టెస్లా 2021 జనవరి నాటికి అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ మోడల్ 3 ప్రీ-బుకింగులను కూడా ప్రారంభించి, జూన్ చివరినాటికి లేదా క్యూ1 2021-2022 నాటికి కార్ల డెలివరీలను ప్రారంభించనుంది.
ఈ విషయం గురించి తెలిసిన వర్గాల సమాచారం ప్రకారం, మార్కెట్ క్యాప్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కార్పొరేషన్ వచ్చే నెల నుండి బుకింగులు ప్రారంభించి 2021-22 మొదటి త్రైమాసికం చివరి నాటికి డెలివరీలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
also read వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. 31 మార్చి 2021 వరకు సర్టిఫికెట్ల వాలిడిటీ పొడిగింపు.. ...
అలాగే దేశంలో ఆర్‌అండ్‌డి సెంటర్, బ్యాటరీ తయారీ సంస్థను ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది. టెస్లా మోడల్ 3 కార్లని డీలర్‌షిప్ ద్వారా కంపెనీ విక్రయించకపోవచ్చు. కానీ ఈ కారు కొనుగోలుకు సుమారు రూ.55 లక్షలు ఖర్చవుతుందని కొందరు భావిస్తున్నారు.
టెస్లా మోడల్ 3 కారు స్పీడ్, మైలేజ్
టెస్లా మోడల్ 3 కారు ఒక్క ఫుల్ ఛార్జీతో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు . ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ 162 కి.మీ. కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. అయితే, దీనికి సంబంధించి సంస్థ నుండి ఇంకా అధికారిక సమాచారం లేదు.
టెస్లా కంపెనీ ఎక్కువగా విక్రయించే కార్లలో టెస్లా మోడల్ 3, టెస్లా మోడల్ వై ఉన్నాయి. టెస్లా భారతదేశానికి వచ్చిన తరువాత, ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఒక విప్లవం ఉండవచ్చు. గత కొంతకాలంగా భారత మార్కెట్లో ఈవీ కార్ల డిమాండ్ గణనీయంగా పెరిగింది.
దేశీయ కార్ల తయారీదారులు మహీంద్రా, టాటా, హ్యుందాయ్‌లు కూడా ఈవీ కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇటువంటి పరిస్థితిలో టెస్లా ప్రవేశించిన తరువాత పోటీ మరింత పెరగనుంది, అలాగే ప్రజలు గొప్ప ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకోవడానికి ఎక్కువ ఆప్షన్ పొందుతారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 29, 2020, 11:03 PM IST