వచ్చే ఏడాదిలో భారత్ విపణిలోకి టెస్లా!
వచ్చే ఏడాది భారత విపణిలోకి అడుగు పెడతామని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెల్లడించారు. ఎప్పుడు వస్తారన్న సంగతి మాత్రం బయటపెట్టలేదు.
2020 నాటికి టెస్లా కార్లు భారత్ మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తెలిపారు. ఆయన ఇటీవల ఐఐటీ మద్రాస్ విద్యార్థులను కలిశారు. ఐఐటీలోని ‘ది ఆవిష్కార్ హైపర్‌లూప్ ’ విద్యార్థుల బృందం ‘స్పేస్‌ఎక్స్ హైపర్ లూప్ పోడ్ కాంపిటేషన్’లో ఫైనల్స్‌కు చేరింది.
ఈ పోటీని జూలై 21వ తేదీన అమెరికన్ ఏరోస్పేస్ అండ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆవిష్కార్ బృందం మస్క్‌ను టెస్లాపై ప్రశ్నించింది. అప్పుడు ఆయన సమాధానం ఇస్తూ ఒక ఏడాదిలో జరగవచ్చని తెలిపారు.
గత కొన్నేళ్లుగా టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా విద్యుత్ వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీని 12 నుంచి 7శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం టెస్లాకు మార్గం మరింత సులువైంది.