Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన టాటా టియాగో...

ప్రయాణ వాహనాల విక్రయాల్లో టాటా టియాగో బెస్ట్ ఎస్ యూవీ మోడల్ కారుగా నిలిచింది. 14 నెలల తర్వాత బెస్ట్ సెల్లర్ కార్లలో ఒకటిగా నిలిచిందని సియామ్ పేర్కొంది. 
 

Tata Tiago re-enters bestseller list
Author
New Delhi, First Published Mar 21, 2019, 5:05 PM IST

దేశవ్యాప్తంగా వీక్ మార్కెట్ సెంటిమెంట్ ఆటోమొబైల్ వాహనాలు ప్రత్యేకించి ప్రయాణ వాహనాలపై కొనసాగుతూనే ఉన్నది. గత ఆరు నెలలుగా ఇదే వరుస. ఫిబ్రవరిలో ప్రయాణ వాహనాల విక్రయాలు సింగిల్ డిజిట్స్ కు పరిమితం అయ్యాయి. బీమా ధరలు, వడ్డీరేట్లు పెరుగడంతో కమర్షియల్ వెహికల్స్ కొనుగోలుపై భారీగా సెంటిమెంట్ ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు లోక్ సభ ఎన్నికల సంరంభం కూడా ఒక కారణంగా ఉన్నది. 

మరోవైపు ఇండస్ట్రీ తమ వద్ద ఉన్న పాత నిల్వలను అమ్ముకునేందుకు ఆపసోపాలు పడుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రయాణ వాహనాలు 1.11 శాతం తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 2,75,357 వాహనాలు అమ్ముడైతే ఈ ఏడాది 2,72,284 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయని సియామ్ తెలిపింది. 

లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేసింది. అయితే బెస్ట్ ప్యాసింజర్స్ వెహికల్స్ విభాగంలో టాప్ -10 చార్ట్ లోకి టాటా మోటార్స్ వారి టాటా టియాగో 14 నెలల తర్వాత తిరిగి చోటు దక్కించుకున్నది. గత నెలలో మారుతి సుజుకికి చెందిన సెలెరియో మోడల్ కారు ఆ స్థానం పొందింది. టాటా టియాగో గత నెలలో 8,286 యూనిట్ల కార్లు విక్రయించింది. అది రెండు లక్షల యూనిట్ల లక్ష్యానికి చేరుకున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సర్దుబాట సాగుతున్నదని నిపుణులు తెలిపారు. 

సహజంగా మారుతి సుజుకి ఆల్టో టాప్ వన్ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 19760 కార్లు అమ్ముడైన ఆల్టో కార్లు 24,751కి చేరాయి. రెండో స్థానంలో టాటా స్విఫ్ట్ 17,291 యూనిట్ల నుంచి 18,224 యూనిట్లు విక్రయం జరిగాయి. మారుతి సుజుకి బాలెనో టాప్ -3లో నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో 15,807 యూనిట్లు విక్రయిస్తే ఈ ఏడాది అవి 17,944కు పెరిగాయి. 

నాలుగో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ గతేడాది పిబ్రవరిలో 15,915 కార్లు విక్రయిస్తే, ఈ ఏడాది 20,941 యూనిట్లు అమ్మింది. వాగన్ఆర్ సేల్స్ 14,029 కార్ల నుంచి 15,661 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ మోడల్ కార్లలో మారుతి సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్రెజా విటారా మోడల్ కార్లు 11,620 యూనిట్ల నుంచి స్వల్పంగా తగ్గి 11,613 యూనిట్లకు పడిపోయాయి. 

తర్వాతీ స్థానాల్లో హ్యుండాయి ఐ20, క్రెట్టా మోడల్ కార్లు కొనసాగుతున్నాయి. హ్యుండాయి ఐ20 కార్ల సేల్స్ 13,378 యూనిట్ల నుంచి 11,547 యూనిట్లకు పడిపోయాయి. ఈ మోడల్ కారు బాలెనో నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హ్యుండాయ్ క్రెట్టా మోడల్ కార్ల విక్రయాలు 9,278 యూనిట్లు పెరిగి 10,206 యూనిట్లకు చేరాయి. హ్యాచ్ బ్యాక్ సేల్స్ ఒక్క శాతం తగ్గిపోయాయి. 
  

Follow Us:
Download App:
  • android
  • ios