5 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటిన టాటా టియాగో కారు..బడ్జెట్ కార్లలో సంచలనంగా టియాగో..
టాటా మోటార్స్ నుంచి విడుదలైన అత్యంత చౌకైన కారు టియాగో హ్యాచ్‌బ్యాక్ భారతీయ మార్కెట్లో 5 లక్షలకు పైగా సేల్స్ సాధించింది. 2016 సంవత్సరంలో ప్రారంభించిన టియాగో గత 7 సంవత్సరాలలో 5 లక్షల యూనిట్లను విక్రయించింది. కేవలం 15 నెలల్లోనే గత లక్ష వాహనాలు అమ్ముడయ్యాయని టాటా మోటార్స్ రిపోర్ట్ చేయడం విశేషం.
టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో భారతదేశంలో 500,000 యూనిట్ల అమ్మకాలను దాటినట్లు ప్రకటించింది. టాటా టియాగోను తయారు చేసే గుజరాత్‌లోని సనంద్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఈ విషయం పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఐదు లక్షల యూనిట్లలో, చివరి 100,000 యూనిట్లు కేవలం 15 నెలల్లో విక్రయించడం విశేషం. టాటా మోటార్స్ మొదటిసారిగా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను ఏప్రిల్ 2016లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
టాటా మోటార్స్ ప్రకారం, అత్యధిక సగటు Tiago కొనుగోలుదారులు 35 సంవత్సరాల వయస్సు. కార్ల కొనుగోలుదారులకు, ముఖ్యంగా తమ మొదటి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి టియాగో ఫేవరెట్‌గా మారిందని టాటా తెలిపింది. Tiago కస్టమర్లలో 71 శాతం మంది FY2023లో తమ మొదటి కారును కొనుగోలు చేయడం విశేషం.
మార్కెట్ పరంగా, టియాగో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మంచి పనితీరును కనబరిచింది. పట్టణ మార్కెట్లలో 60 శాతం విక్రయాలు జరుగుతుండగా, మిగిలిన 40 శాతం గ్రామీణ మార్కెట్ల నుంచి వస్తున్నాయి. టియాగోను కొనుగోలు చేసే వారిలో మహిళల సంఖ్య కూడా పెరిగిందని టాటా పేర్కొంది. దీని విక్రయాల్లో దాదాపు 10 శాతం మహిళలే అందిస్తున్నారు. టాటా ప్రకారం, ఇది మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి బెస్ట్ చాయిస్ గా ప్రసిద్ధి చెందింది, 2023లో 71 శాతం మంది వినియోగదారులు మొదటిసారి కారు కొనుగోలు చేసిన వారే ఉండటం విశేషం.
టియాగో XE, XM, XT (O), XT, XZ, XZ+ అనే ఆరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, Tiago మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్. ఈ వాహనం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 85bhp, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో, ఇంజిన్ 72 bhp, 95 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. Tiago EV 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది 250 కిమీల మైలేజ్ అందిస్తుంది. 24 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిమీ ప్రయాణించగలదు. Revotron 1.2 l, 3-సిలిండర్ BS6 ఇంజన్ పెట్రోల్, CNG వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టియాగో, టియాగో NRG వేరియంట్‌లు ఒకే విధమైన పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తున్నాయి. ICNG వేరియంట్ పెట్రోల్ మోడ్‌లో 86 PS (63.0 kW) 6000 RPMని అందిస్తుంది.CNG మోడ్ 73.4 PS (54 KW) 6000 RPMని అందిస్తుంది.
టాటా మోటార్స్ గత సంవత్సరం భారతదేశంలో టియాగో EV యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. Tiago EV భారతదేశంలో కంపెనీ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా పేరు సంపాదించింది. ఇది రూ.8.69 లక్షలతో మొదలై రూ.12.04 లక్షలకు అందుబాటులో ఉంది. మూడు పవర్‌ట్రెయిన్‌లలో ఏ కారు అత్యధిక సేల్స్ ఉందో టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ అత్యంత ప్రజాదరణ పొందినది పెట్రోల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. టియాగోలో డీజిల్ వేరియంట్ లేదు. అయితే, ఎలక్ట్రిక్ వేరియంట్ టియాగో ఈవీ ఇప్పటివరకు 19458 యూనిట్లను విక్రయించినట్లు టాటా వెల్లడించింది. Tiago EV భారతదేశంలో చౌకైన నాలుగు-డోర్ల ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. లాంచ్ అయిన రోజునే దీనికి 10,000 బుకింగ్స్ వచ్చాయి.