కొత్త స్టయిల్, లుక్ తో టాటా సఫారిని నెక్స్ట్ జనరేషన్ మోడల్.. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల

టాటా మోటార్స్ తో ప్రాచుర్యం పొందిన టాటా సఫారి ఎస్‌యూవీ ఎల్లప్పుడూ వినియోగదారుల గుర్తుండే మోడల్. ప్రతి దశాబ్దంలో కంపెనీ దీనిని కొత్త ఫార్మాట్‌లో ప్రవేశపెడుతుంది.

tata safari new model  tata gravitas 2021 price in india check  launch date and specification

ఒకప్పుడు దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తో ప్రాచుర్యం పొందిన టాటా సఫారి ఎస్‌యూవీ ఎల్లప్పుడూ వినియోగదారుల గుర్తుండే మోడల్. ప్రతి దశాబ్దంలో కంపెనీ దీనిని కొత్త ఫార్మాట్‌లో ప్రవేశపెడుతుంది. ఇప్పుడు మరోసారి టాటా కంపెనీ దీనిని కొత్త రూపంతో, కొత్త పేరుతో 2021లో లాంచ్ చేయబోతోంది.

టాటా మోటార్స్ ఈ 7 సీట్ల ఎస్‌యూవీకి టాటా గ్రావిటాస్‌ అని పేరు పెట్టింది. టాటా గ్రావిటాస్‌ను టాటా సఫారి తదుపరి తరం మోడల్‌ అని కంపెనీ అభివర్ణించింది. టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీపై చాలా ఆశలు పెట్టుకుంది, అతి త్వరలో దీన్ని భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది.

గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ టాటా గ్రావిటాస్‌ను పరిచయం చేసింది. అప్పటి నుండి కారు ప్రేమికులు ఈ ఎస్‌యూవీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.  

టాటా గ్రావిటాస్‌ కొలతలు గురించి చెప్పాలంటే టాటా గ్రావిటాస్‌ 2021 మోడల్ పొడవు, వెడల్పు, ఎత్తు టాటా సఫారి కంటే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాని షేప్, డిజైన్ టాటా హారియర్ తలపిస్తుంది.

టాటా గ్రావిటాస్‌కు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా గ్రావిటాస్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్  ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. 

also read ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్.. అమెజాన్ సి‌ఈ‌ఓ డౌన్.. కారణం ఏంటంటే ? ...

టాటా గ్రావిటాస్ ఫీచర్స్

టాటా గ్రావిటాస్ ఆధునిక ఎస్‌యూవీలో చాలా లేటెస్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్‌కు మద్దతు ఇచ్చే 8.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇందులో ఉంటుంది, దీనికి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్  కూడా ఇచ్చారు. ఇవి కాకుండా ఈ కారులో పవర్డ్ డ్రైవింగ్ సీట్, ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎసి, జెబిఎల్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.  

 మార్కెట్లో పోటీ

టాటా మోటార్స్  టాటా గ్రావిటాస్ ఎస్‌యూ‌వి పనితీరు, డిజైన్, సాంకేతికత పరంగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. ఈ ఎస్‌యూవీ సంస్థ యొక్క తాజా ఒమెగార్క్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. ల్యాండ్ రోవర్ కార్లను ఈ ప్లాట్‌ఫాంపై తయారు చేస్తారు. టాటా గ్రావిటాస్ 6, 7 సీట్ల ఆప్షన్ తో వస్తుంది. టాటా గ్రావిటాస్ 7 సీట్ల ఎంజి హెక్టర్ ప్లస్, మహీంద్రా రాబోయే ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 2021 మోడల్ వంటి కార్లతో భారత మార్కెట్లో పోటీ పడనుంది. 

బుకింగ్, ధర 
 టాటా మోటార్స్ ప్రసిద్ధ ఎస్‌యూవీ సఫారి తదుపరి మోడల్ టాటా గ్రావిటాస్ అని, దాని బుకింగ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపింది. టాటా మోటార్స్ నుండి టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాటా హారియర్ ప్రస్తుతం టాటా మోటార్స్ అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ. టాటా హారియర్ టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షలకు పైగా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios