ఒక్క నెలలోనే మార్కెట్లోకి 100కి పైగా వాహనాలు... టాటా మోటార్స్
వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో నాలుగు అంతర్జాతీయ ఆవిష్కరణలతోపాటు 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాజేంద్ర పెట్కర్ తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాలతోపాటు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా 100కి పైగా వాహనాలను ఈ నెలలోనే విపణిలోకి విడుదల చేస్తామని టాటా మోటార్స్ తెలిపింది. వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో నాలుగు అంతర్జాతీయ ఆవిష్కరణలతోపాటు 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాజేంద్ర పెట్కర్ తెలిపారు.
also read సోనీ కంపెనీ నుండి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్...
2020 జనవరి నుంచి 100 ప్రధాన మోడల్ వాహనాల్లో 1000 వేరియంట్లను బీఎస్-6 ప్రమాణాలతో మార్కెట్‌కు పరిచయం చేస్తామని రాజేంద్ర పెట్కర్ చెప్పారు. వీటిలో పవర్ ట్రయిన్ కాంబినేషన్లు, ఎలక్ట్రిక్, షేర్డ్ అండ్ సేఫ్టీ తదితర మోడల్ కార్లు ఉన్నాయన్నారు. డిజిటల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టూల్స్, ఛేసిజ్ కాన్పిగరేషన్స్ ప్లస్ టెక్నాలజీస్ ఇంబైంబింగ్ కనెక్టెడ్ తదితర మోడల్స్ ఉన్నాయని రాజేంద్ర పెట్కర్ తెలిపారు.
వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెప్పారు. టాటా మోటార్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్యుంటెర్ బుచెక్ మాట్లాడుతూ ఆటో ఎక్స్ పోలో ఎఫిషియెంట్, గ్రీన్, సస్టయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. పది నెలల తర్వాత ఉత్పత్తి పెంచుకున్న మారుతి
వరుసగా తొమ్మిది నెలలపాటు ఉత్పత్తిని తగ్గించుకున్న కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఎట్టకేలకు ఉత్పత్తిని పెంచుకుంటున్నది. వరుసగా రెండో నెల డిసెంబర్‌లో 1,15,949 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 1,07,478లతో పోలిస్తే 7.88 శాతం అధికం.
also read తక్కువ ధరకే మార్కెట్లోకి మహీంద్రా ఎస్‌యూవి ఎలక్ట్రిక్ కార్...
పెరిగిన కంపాక్ట్ సెగ్మెంట్ల కార్ల ఉత్పత్తి
కాంప్యాక్ట్ సెగ్మెంట్‌కు చెందిన న్యూ వ్యాగన్ ఆర్, సెలేరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, ఓఈఎం మోడల్, డిజైర్‌లను సంయుక్తంగా 62,448లను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం 44,329లు ప్రొడక్షన్ చేసింది. మినీ సెగ్మెంట్‌కు చెందిన ఆల్టో, ఎస్-ప్రెస్సో, పాత వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మాత్రం 9.54 శాతం తగ్గించడంతో 25,316లకు పడిపోయాయి. వీటితోపాటు జిప్సీ, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్-6, ఎస్-క్రాస్‌లను 19825 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారమిచ్చింది.
సూపర్ క్యారీ వెహికల్స్‌కు యమ డిమాండ్
894 యూనిట్ల మధ్యస్థాయి సెడాన్ సియాజ్ కార్లను ప్రొడక్షన్ చేసిన సంస్థ..లైట్ కమర్షియల్ వాహనమైన సూపర్ క్యారీలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటి ఉత్పత్తిని రెండు రెట్లు 545 నుంచి 987లకు పెంచుకున్నది. నవంబర్ నెలలోనూ సంస్థ ఉత్పత్తిని 4.33 శాతం పెంచుకున్నది.