మారుతి ఎస్-ప్రెస్సోకి జీరో సేఫ్టీ రేటింగ్.. విరిగిన కాఫీ కప్పుతో టాటా మోటార్స్ కామెంట్..
టాటా మోటార్స్ సోషల్ మీడియాలో మారుతి ఎస్-ప్రెస్సో భద్రతా రేటింగ్‌ను ప్రస్తావిస్తు విరిగిన "కాఫీ" కప్పు ఫోటోతో "మేము అంత తేలికగా విచ్ఛిన్నం కాము" అంటూ కంపెనీ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది.
గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ ఫలితాలను ఈ వారం ప్రారంభంలో ప్రకటించారు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా సెల్టోస్ వంటి మేడ్ ఇన్ ఇండియా కార్లు అంచనాల కంటే తక్కువ భద్రతా రేటింగ్‌ను పొందాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రెండు స్టార్లను, కీయా సెల్టోస్ మూడు స్టార్లను సాధించగా, మారుతి ఎస్-ప్రెస్సో సున్నా స్టార్ పొందింది. దీనిని అవకాశంగా చేసుకొని టాటా మోటార్స్ సోషల్ మీడియాలో మారుతి ఎస్-ప్రెస్సో భద్రతా రేటింగ్‌ను ప్రస్తావిస్తు విరిగిన "కాఫీ" కప్పు ఫోటోతో "మేము అంత తేలికగా విచ్ఛిన్నం కాము" అంటూ కంపెనీ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది.
ఇది ఖచ్చితంగా టాటా మోటార్స్ రెస్పెక్ట్ అని మేము చెబుతాము, మారుతి సుజుకి దీని నోట్ చేసుకొని మార్పు చేయమని ప్రోత్సహిస్తుందని మేము ఆశిస్తున్నాము. మారుతి ఎస్-ప్రెస్సో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా టియాగోతో పోటీపడుతుంది.
also read ప్లాస్టిక్ బాటిల్స్ తో ఎలక్ట్రిక్ కారు.. అదరగొట్టిన విద్యార్థులు ...
గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ ఫలితాల్లో టాటా టియాగో ఫోర్-స్టార్ రేటింగ్‌ను పొందింది. టాటా మోటర్స్ చేసిన ట్వీట్‌కు బదులుగా గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రెసిడెంట్, సిఇఒ డేవిడ్ వార్డ్ ఈ విధంగా రిట్వీట్ చేశాడు. అంతేకాదు ఇది సురక్షితమైన కార్ల కోసం మార్కెట్‌ను నిర్మించడంలో సహాయపడుతుందని అన్నాడు.
టియాగో కారు మాత్రమే కాదు, టాటా మోటార్స్ తో పాటు మహీంద్రా & మహీంద్రా కంపెనీ కూడా కార్లపై భద్రతను పెంచడంలో సరైన ముందడుగు వేసింది. టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్, మహీంద్రా ఎక్స్‌యువి 300 కూడా ఫైవ్ స్టార్ రేటెడ్ కార్లు.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఫోర్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను స్కోర్ చేస్తుంది. టాటా టియాగో వాహన తయారీదారులకు గేమ్‌ఛేంజర్, అలాగే ప్యాసింజర్ వాహన విభాగంలో బ్రాండ్, దాని కొత్త వ్యూహాన్ని తిరిగి స్థాపించడంలో కీలకపాత్ర పోషించింది. ఇది కంపెనీకి హాట్ సెల్లర్‌గా కొనసాగుతోంది. మారుతి సుజుకి ఆల్టో కూడా హాట్ సెల్లర్.
గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ మార్కెట్లో విక్రయించే బేస్ వేరియంట్‌ను టెస్ట్ కోసం మాత్రమే పరిగణిస్తుంది. టెస్ట్ చేసిన మారుతి ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ లో డ్రైవర్-సైడ్ మాత్రమే ఎయిర్‌బ్యాగ్ ఉంటుంది, అయితే కారు బాడీ షెల్‌ను ఆన్ స్టేబుల్ రేట్ చేసింది, పిల్లల భద్రత కోసం ఎస్-ప్రెస్సోకు రెండు స్టార్లు లభించాయి.
మారుతి సుజుకి కార్ క్రాష్ టెస్ట్ ఫలితాలపై స్పందిస్తూ, "భారత ప్రభుత్వం ఇటీవల కార్ క్రాష్ టెస్ట్ ప్రమాణాల దృడత్వాన్ని పెంచింది, వాటిని యూరోపియన్ ప్రమాణాలకు సమానంగా చేసింది. మారుతి సంస్థ అన్ని ఉత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయి, భారత ప్రభుత్వం చేత తగిన విధంగా పరీక్షించి ధృవీకరించబడ్డాయి. " అని తెలిపింది.